చట్టం లో అతి ముఖ్యమైన పాత్ర పోషించేది భారత రాజ్యాంగం రూపొందించిన ఆర్టికల్స్ ప్రకారం న్యాయస్థానాలది… న్యాయ వాదుల వాదోపవాదాలు విన్న తర్వాత శిక్షార్హులకు దండన విధించేది న్యాయమూర్తి… ఈ న్యాయమూర్తులను భగవత్ స్వరూపులుగా న్యాయవాది కానీ ముద్దాయి కానీ సామాన్యులు కానీ చూస్తారు.అక్కడ న్యాయ మూర్తికి రెండు చేతులు జోడించి దేవుడికి ఏవిదంగా వేడుకుంటారో ఆవిదంగా నమస్కరిస్తారు.. కానీ కోరుట్ల ఓపెన్ కోర్టులో లయన్స్ క్లబ్ ప్లెక్సీ పెట్టి కార్యక్రమాన్ని నిర్వహించడం దుమారం లేపుతుంది.ఓపెన్ కోర్టులో ఏ విధమైన ప్లెక్సీ కానీ బ్యానర్ లు కానీ ఉండొద్దు అనే నియమావళి ఉంది. కానీ “”దేవస్థానం తరువాత న్యాయస్థానం అంటారు లేదా రసీదు తప్పితే మసీదు అంటారు “” లయన్స్ క్లబ్ వారూ చట్టాలు కూడా వారు తలుచుకుంటే చుట్టాలు అన్నట్లు ఓపెన్ కోర్టు లో బ్యానర్ ఏర్పాటు చేసి న్యాయవ్యవస్థను కూడా అపహాస్యం చేశారని వాదనలు వినిపిస్తున్నాయి., చట్టం ఉన్నవారికి చుట్టలేనా అన్న వాదనలు బలపడుతున్నాయి