అధికారుల నిర్లక్ష్యం…
రెండు నిండు ప్రాణాలు బలి…
చావు బతుకుల్లో ఏడుగురు…
హుటాహుటిన మరమ్మత్తులు
షోకాజ్ నోటీస్ లతో చేతులు దులుపేసుకుంటారా…?
రణం: న్యూస్ కోరుట్ల: జులై 14
జగిత్యాల జిల్లా కోరుట్ల నుండి మెట్పల్లి వెళ్లే జాతీయ రహదారిని ఆనుకుని వినాయక విగ్రహ తయారీ కేంద్రాలు పదుల సంఖ్యలో కుంటాయి. ఈ విగ్రహ తయారీ కేంద్రాలలో మన రాష్ట్రముతో పాటు ఇతర రాష్ట్రాల కు సంబంధించిన చాలా మంది ఉపాధిపొందుతున్నారు. గతనెల జూన్ 15 న
వినాయక ప్రతిమను ఒకచోట నుండి ఇంకో చోటకు తీసుకెళ్లే క్రమంలో విద్యుత్ షాక్ తగిలి ఇద్దరు అదేరోజు మృతి చెందగా తొమ్మిది మంది తీవ్ర గాయాల పాలైన సంఘటన తెల్సిన విషయమే.గాయాల పాలైన వారిలో ఏడుగురి పరిస్థితి విషమంగానే ఉంది. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం ఈ దుర్ఘటనకు కారణం అని ప్రతి చోట వినపడుతున్న మాట బహిరంగ రహస్యమే.
వినతులన్నీ….. బుట్టదాఖలే…
విద్యుత్తు ప్రమాదానికి కారణమైన కరంట్ పోల్స్,తీగల స్థానం లో కొద్దిరోజుల్లోనే కొత్తవి అమర్చారు. ఈ 33/11 కేవీ విద్యుత్ లైన్ ఎత్తు తక్కువగా ఉండి తీగలు కిందకి జారీ ప్రమాదకరంగా ఉన్నాయని, పలుసార్లు అధికారులకు వినతులు ఇచ్చినా ఎలాంటి చర్యలకు పూనుకోలేదని పైగా ఖర్చులతో కూడుకున్న విషయమని అధికారులు సమాదానమిచ్చారని స్థానికులు చెప్పుకొస్తున్నారు. “”చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు.. జరగాల్సిన నష్టం జరిగింది”” ప్రాణ నష్టం జరిగిపోయాక కొత్త స్తంభాలు అమర్చి,వైర్లు అమర్చారని స్థానికులు విమర్శిస్తున్నారు. ఇంత పెద్ద ప్రమాదం జరిగి ప్రాణాలు కోల్పోయిన, ప్రమాదబారిన పడి తీవ్రగాయలతో జీవశ్చవాలల మారిన బాధితులకు నష్ట పరిహారం ఇస్తామన్న ఏ ఒక్క అధికారి అటు వైపు కన్నెత్తి చూడకపోవడం శోచనీయం.
హుటా హుటిన మరమ్మత్తులు..పోల్స్ బిగించడం.. దేనికి సంకేతాలు…
ఒక్కొక్క ఏరియాను బట్టి కరంట్ పోల్ ఎత్తు నిర్ణయిస్తారు.కానీ ఈ సంఘటన జరిగిన ప్రదేశంలో అక్కడ రోడ్ హైట్ గా ఉండటం ఎప్పుడో వేసిన పోల్స్ ఉండటం ఆ విద్యుత్ తీగలు కిందకు జారిఉండటం ప్రమాదానికి ప్రధాన కారణం.ప్రమాదం జరగక ముందు ఎన్నిసార్లు అధికారులకు సమస్య వివరించిన పట్టించుకోకపోగా ,ప్రాణ నష్టం జరిగాక హుటాహుటిన ఎత్తుగల విద్యుత్ స్తంభాలు పాతడం, వైర్లని సరి చేయడం కూడా అధికారుల నిర్లక్షం స్పష్టంగా కనిపిస్తుంది. అధికారులు ఈ దుర్ఘటన కు పరోక్ష కారకులు అని కూడా తెలియవస్తుంది.
పద్నాలుగు మంది అధికారులకు మెమో లు..?
చిన్న తప్పుకే సస్పెన్షన్… కానీ విధలునిర్లక్ష్యం చేసిన అధికారులకు నోటీస్ లతో సర
ఈ ఘటనకు గల కారణాలపై
తెలంగాణ విద్యుత్ శాఖ సీఎండీ కార్యాలయం నుండి కోరుట్ల ఏడీఈ స్థాయి అధికారి ఒకరిపై, ఆరుగురు లైన్మెన్ల కు, ఏడుగురు జూనియర్ లైన్మెన్లకు షోకాజ్ నోటీసుల (మెమో)లు మొత్తం పద్నాలుగు మంది అధికారులకు జారీ చేసినట్లు తెలియవస్తుంది.
ఇదే ట్రాన్స్కో శాఖలో కథలపూర్ మండలంలో పై అధికారులకు సమాచారం ఇవ్వకుండా కొంతసమయం విద్యుత్ నిలిపివేసినందుకు ఒక జూనియర్ లైన్ మెన్ పై సస్పెన్షన్ వేటు వేసిన అధికారులు ఇంత పెద్ద దుర్ఘటన జరిగిన అధికారులకు షోకాజ్ నోటీస్ లు ఇచ్చి సంజాయిషీలతో సరి పెట్టుకోవడం ఎంత వరకు సబబా అని గుసగుసలు వినిపిస్తున్నాయి.నోటీసులతో సరిపెట్టుకుంటారో… సస్పెన్షన్ వేటు వేస్తారో.. వేచిచూద్దాం..