ఒక వైపు మురుగునీరు… మరోవైపు నేలను తాకుతున్న విద్యుత్ తీగలు
ప్రమాదపు అంచున వార్డు ప్రజలు..
29వార్డు ప్రజల దుస్థితి
వార్డు పై దృష్టి పెట్టరా… బీజేపీ పట్టణ ఉపాధ్యక్షుడు తోట రాజేష్
రణం న్యూస్ కోరుట్ల ,జూన్ 26
పట్టణ శివారు ప్రాంతాల్లో కొత్తగా అభివృద్ధి పనులు చేపడతారు అక్కడ వసతులు సరిగా లేక రవాణా వ్యవస్థ మురికుకాలువలు నిర్మణాల దశలో ఉంటాయి కాబట్టి వర్షాకాలం చినుకు పడితే చిత్తడిగా మారిపోతుంది. అది సహజమే. కానీ పట్టణం లో ప్రతి వార్డు సమస్యల నిలయాలు. స్వచ్ఛ కోరుట్ల పేరిట ఎన్నో అవార్డులు అందుకొని కోట్ల నిధులు వచ్చిన అభివృద్ధి మాత్రం శూన్యముగానే కనిపిస్తుంది. మచ్చుకు ఈ రోజు పట్టణంలో అత్యాధునిక నిర్మాణాలు ప్రముఖులు నివసించే,పాఠశాలలు, హాస్పిటల్ లు,ఇతర వార్డులకు వెళ్లే ప్రధాన దారులు గల చిన్న వర్షం పడితే 29 వ వార్డ్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం.
ప్రమాదకరంగా విద్యుత్ తీగలు
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో కొత్త బస్టాండ్ సమీపంలో రథాలపంపు ఏరియా 29 వ వార్డులో విద్యుత్ స్తంభాలకు కేబుల్ ,ఇంటర్నెట్ తీగలు కిందకు వ్రేలాడుతూ పాదచారులకు వాహన దారులకు ఇబ్బందిగా మారాయి.ఇంట్లో నుండి బయటకు రాకుండా అడ్డుగా ఈ తీగలు ఉండటం గమనార్హం.కొన్ని రోజులుగా ఈ విదంగా ప్రజలకు అసౌకర్యంగా ఉన్న వీటిని తొలగించడం లో జాప్యం ఎందుకు జరుగుతుందో విద్యుత్ అధికారులకు తెలియాలి.పోల్ చార్జీలు ఇచ్చి పుచ్చుకోవడం లో ఏమైనా అంతరాయం కలిగిందో మాకెందుకులే అనే నిర్లక్షమో తెలియదుకాని వార్డు ప్రజలకు రాకపోకలు జరిపే వారికి ఇంటికి అడ్డుగా ఉన్న ఈ తీగలు తొలగించక పోవడం ఈ సమస్య గురించి ఎవరికి చెప్పాలో తెలియక సతమతమౌవుతున్నారు. కేబుల్ ఆపరేటర్ల పైన మక్కువనా ఇంటర్ నెట్ వారిపైన మక్కువనా లేక వీరివురు ఇచ్చే మామూళ్ల పైన మక్కువనా అని విద్యుత్ అధికారుల తీరుపైన వార్డు ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.ఇదిలా ఉండగా పట్టణంలో ప్రతి ఏరియాలో ఇలాంటి పరిస్థితులే కనిపిస్తాయి.ఇప్పటికైనా కరంటోళ్లు గజిబిజిగా విద్యుత్ స్తంభాలకు వేలాడదీసిన తీగలు సరిచేస్తారో లేదో వేచి చూద్దాం.
చినుకు పడితే చాలు చిత్తడి చిత్తడే
వివరాల్లోకి వెళితే కోరుట్ల పట్టణం లో బస్టాండ్ జాతీయరహదారిని ఆనుకొని ఉన్న 29వ వార్డ్ లో చిన్న వర్షానికే ప్రతి గల్లీ బురద మయం అవుతుంది.ఈ వార్డులో వర్షపు నీరు మురికినీరు నిలిచి దోమల బెడద అధికం అయింది.అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి. డ్రైనేజీలు సరిగా లేక వర్షాలు కురిస్తే ఈ రోడ్లన్నీ వాగులను తలపిస్తాయి.వర్షాలు వెలిశాఖ ఆ నీరు బురద వారం రోజులైనా నిల్వవుంటుంది.ఇలా నిల్వఉన్న నీటిలో మురిగుకాలువలనీరు కలసి ప్రజలు అనారోగ్యాలకు గురవుతున్నారు.వీటి నుండి వచ్చే దుర్వాసన ,ఇళ్ల ముందు నిలిచిన వర్షపు మురుగునీరు నిల్వ ఉండటంలో దోమలబెడద, ఈగల బెడద అధికంగా ఏర్పడి విష జ్వరాలు సీజనల్ వ్యాధుల బారిన పడుతున్నారు. ఈ వార్డులో టీచర్స్ క్లబ్ రోడ్,జెమిని కాంప్లెక్స్ రోడ్ లో ఒక నీటి కుంటను తలపించే మురుగు నీటి నిల్వలు మనకు కనిపిస్తుంటాయి.నిత్యం రద్దీగా ఉండే అధికారుల ప్రజా ప్రతినిధుల తిరిగే 29 వ వార్డులో ఇలాంటి పరిస్థితి ఉంటే పట్టన శివారు ప్రాంతాల్లో ఉండే కాలనీల పరిస్థితి చెప్పనవసరం లేదు. ప్రజలు హాస్పిటల్ లకు స్కూల్ లకు పట్టణంలోని కూరగాయల మార్కెట్ కు ఈ వార్డు తర్వాత ఉన్న ఇతర వార్డులకు వెళ్లే ప్రధాన దారుల్లో కంపు కొట్టే వాతావరణం ఏర్పడితే స్వచ్ఛ కోరుట్ల పట్టణ ప్రణాళిక ల పేరుతో వస్తున్న నిధుల ఏమైనట్లో ఆలోచించాల్సిన విషయం. ఇది మున్సిపాలిటీయా మురికి పాలిటియా అని వార్డు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
29 వార్డు సమస్య లపై పాలకులు దృష్టి పెట్టాలి
తోట రాజేష్ పట్టణ బిజెపి ఉపాధ్యక్షుడు




డ్రైనేజి నిర్మణాలలో నాణ్యత లోపం ఇష్టారీతిన నిర్మించడంతో మురికిక్కాలువల నీరు ఇళ్ల ముందు రోగాలకు కారణం ఆతున్నాయి.దోమల బెడద దుర్వాసనలతో సీజనల్ వ్యాధుల బారిన పడుతున్నారు. డ్రైనేజి లపై కట్టే చిన్న కల్వర్టు రోడ్డు కంటే ఎత్తులో ఉండి మురికి వర్షపు నీరు నిల్వవుంటుంది.ఈ నిర్మాణాలు కాసుల కోసం కాకుండా ప్రజారోగ్యం పై ప్రభావం పడకుండా ఉండేలా ఉండాలి.గత మున్సిపల్ పాలకవర్గ సభ్యులు ఏళ్లుగా వార్డ్ సభ్యులుగా ఉన్న వార్డు అభివృద్ధికి చేసిందేమిలేదు.వార్డ్ ప్రజల బాగోగులు పక్కకు వదిలేసి కమీషన్ల కోసం పని చేశారు. వార్డు మురికి కూపాలుగా మారిన పట్టించుకోలేదు అధికారాన్ని వ్యాపారంగా చూశారు తప్ప ప్రజావాసరాలను పట్టించుకోలేదు.సీసీ రోడ్ల డ్రైనేజిలు నిర్మించిన కొంత కాలనికే పెచ్చులుడిపోయాయి.
విద్యుత్ స్తంభాల తీగలు పాదచారులకు తగిలి ప్రమాదాల సంకేతాలుగా దర్శనమిస్తున్నాయి. అధికారులు ఇప్పుడైనా కళ్ళు తెరిచి తీగలు సరిచేసి, మురికి నీరు నిల్వవుండకుండా ప్రత్యేమ్నాయము చూడాలి.