బుద్ద పూర్ణిమ మహోత్సవాన్ని విజయవంతం చేద్దాం
ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పేట భాస్కర్
రణం: న్యూస్ కోరుట్ల: మే7
ప్రపంచ మానవాళి చరిత్రలో అత్యంత గొప్ప ఆద్యాత్మిక గురువు తథాగత గౌతమ బుద్దిని జన్మదినం వైశాఖ పౌర్ణమి సందర్భంగా ఈనెల12న మెట్పల్లిలో నిర్వహించనున్న బుద్ద పూర్ణిమ మహోత్సవమును విజయవంతం చేద్దామని తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ, అంబేద్కర్ యువజన సంఘాల రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పేట భాస్కర్ పిలుపునిచ్చారు.
బుధవారం కోరుట్ల లోని అంబేద్కర్ విగ్రహం వద్ద మహోత్సవ కరపత్రాలను అంబేద్కర్ యువజన సంఘాల రాష్ట్ర నాయకులు బలిజ రాజరెడ్డి, వుయ్యాల నర్సయ్యలతో పాటు నిర్వహాకులు వివిధ కుల సంఘాల నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈసందర్భంగా పేట భాస్కర్ మాట్లాడుతూ బుద్ద భగవానుని జ్ఞానాన్ని 84 వేల స్థూపాలపై చెక్కించి అనేక శిలశాసనాల ద్వారా వ్యాప్తి చేశారని సమత, ప్రజ్ఞ, కరుణ ద్వారా కామ, క్రోధ, లోభ, అసూయ ద్వేషాలను జయించే సత్యాన్ని గ్రహించిన మౌర్య చక్రవర్తి అశోకుడు, విశ్వజ్ఞాని బాబా సాహెబ్ బి ఆర్ అంబేద్కర్ డు బౌద్దం స్వీకరించారని స్వేచ్ఛ సమానత్వం సోదరబావంను ప్రభోదించేది బౌద్దమని భాస్కర్ కొనియాడారు.ఈకార్యక్రమంలో నవయాన బుద్దిస్ట్ సొసైటీ అధ్యక్షులు దయ్య రఘువీర్, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఎలిశేట్టి గంగారెడ్డి, ఎన్ ఎచ్ఎఫ్ అధ్యక్షులు షాహేద్ మహ్మద్ షేక్,అపీస్ అంబేద్కర్ సంఘాల డివిజన్ అధ్యక్షులు వుయ్యాల శోభన్,మాల మాదిగ కుల సంఘాల అధ్యక్షులు పొట్ట లక్ష్మణ్, శనిగారపు రాజేష్ ప్రధాన కార్యదర్శి బలిజ సంతోష్ నాయకులు గొరుమంతుల సత్తయ్య, నీరటి నరేందర్, సామల్ల వేణు, గాలి నరేష్, మారంపల్లి నర్సయ్య, ముత్తయ్య,రాజయ్యలు తదితరులు పాల్గొన్నారు.
