మావోయిస్టు అగ్రనేత పసుల వసంతను పరామర్శించిన జువ్వాడి నర్సింగరావు



రణం :న్యూస్ కోరుట్ల:మే 5,
కోరుట్ల పట్టణ అంబేద్కర్ నగర్ కు చెందిన పసుల రాంరెడ్డి వసంత దంపతులు మావోయిస్టు పార్టీ కార్యకలాపాలకు ఆకర్షితులై పార్టీలో చేరారు వివరాల్లోకి వెళ్తే కోరుట్ల పట్టణ అంబేద్కర్ నగర్ కు చెందిన పసుల రాంరెడ్డి 1975 సంవత్సరంలో మావోయిస్టు పార్టీలో చేరగా పార్టీ కార్యకలాపాలపై బయటకు రావడంతో పోలీసులు విషయం తెలుసుకుని అతని అరెస్టు చేసి జైలుకు తరలించారు బెయిల్ పై బయటికి వచ్చిన రాంరెడ్డి రెండు సంవత్సరాలు కుటుంబ సభ్యులతో గడపగా అనంతరం మళ్లీ నిర్బంధం ఎక్కువ కావడంతో 1978లో మళ్లీ తిరిగి పార్టీలో చేరారు పోలీసుల తరచూ వచ్చి వసంతను భర్త ఆచూకీ కోసం తెలుపమని చాలాసార్లు కోరారు నిరాకరించిన ఆమె కూడా 1985లో వసంత కూడా మావోయిస్టు పార్టీలో చేరారు 2000 సంవత్సరంలో భర్త రామ్ రెడ్డి సిరిసిల్ల ఏరియాలో జరిగిన పోలీస్ ఎదురుకాల్పుల్లో మరణించారు తెలంగాణలో రోజురోజుకు నిర్బంధం ఎక్కువ కావడంతో పార్టీ కార్యకలాపాలు పక్క రాష్ట్రాలకు వ్యాపించాయి కేంద్ర కమిటీ సూచన మేరకు మధ్యప్రదేశ్ ఛత్తీస్గడ్ ఏరియాలో ఏరియా కమాండర్ గా విధులు నిర్వహిస్తున్న తరుణంలో అక్కడి ప్రభుత్వం మావోయిస్టులు లొంగిపోవాలని లొంగిపోయిన వారికి ఎలాంటి ప్రాణహాని తలుపెట్టమని చెప్పడంతో పసుల వసంత అక్కడి ఎస్పీ ముందు లొంగిపోయారు ఆమెపై మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఎనిమిది లక్షల రివార్డును కూడా ప్రకటించింది ఆమెకు ఎలాంటి గుర్తింపు కార్డు లేకపోవడంతో ప్రభుత్వం ద్వారా అందాల్సిన రివార్డు అందలేకపోయింది సోమవారం వసంతను కోరుట్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు పరామర్శించి ఆమెకు ప్రభుత్వం ద్వారా రావాల్సిన ఎనిమిది లక్షల రివార్డును అందేలా కృషి చేస్తామన్నారు ఆమెకు త్వరలోనే గుర్తింపు కార్డు తెలంగాణ ప్రభుత్వం ద్వారా అందజేసేలా కలెక్టర్ ఎస్పీ లతో మాట్లాడి చర్యలు చేపడతామన్నారు సుమారు 40 సంవత్సరాల అజ్ఞాత జీవితం గడిపి ఇటీవల లొంగిపోయి ఇంటికి తిరిగి వచ్చిన ఆమెను చూసి కాలనీవాసులు కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోయారు అసలు ఆమె ఉందో లేదో తెలియని కుటుంబ సభ్యులకు ఆమె లొంగిపోయిన విషయాన్ని తెలవగానే వారి ఆనందానికి అవధులు లేవన్నారు అనంతరం ఆమెకు ఉండడానికి కూడా చోటు లేదు ఉన్న ఇల్లు కూడా వర్షాలకు ధ్వంసం అయింది ప్రభుత్వం ద్వారా ఆమెకు రావలసిన రివార్డును గృహ నిర్మాణాన్ని కూడా చేపట్టే విధంగా చర్యలు చేపడతామన్నారు అనంతరం ఆమెను జువ్వాడి నర్సింగరావు శాలువాతో సన్మానించారు ఈకార్యక్రమంలో జువ్వాడి నర్సింగరావు తో పాటు కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పన్నాల అంజిరెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పెరుమాండ్ల సత్యనారాయణ నాయకులు అన్నం అనిల్ జిందం లక్ష్మీనారాయణ ఎంబేరి నాగభూషణం మోర్తాడ్ లక్ష్మీనారాయణ పసుల కృష్ణ ప్రసాద్ చిట్యాల లక్ష్మీనారాయణ జెట్టి లక్ష్మణ్ నరేష్ రాజు కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల నాయకులు కార్యకర్తలు పసుల వసంత కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు