ముఖ్యమంత్రి సహాయనిది పేద మధ్య తరగతి ప్రజలకు వరం…
ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ప్రజలను ప్రభుత్వం ఆదుకుంటుంది…
కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ జువ్వాడి నర్సింగరావు
కోరుట్ల పట్టణ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో నూతన చైర్మన్ ఛాంబర్ ను ప్రారంభించి అనంతరం ఆనారోగ్య సమస్య వల్ల ఆర్థిక ఇబ్బందుల పాలవుతున్న పేద మధ్యతరగతి ప్రజలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా ఆదుకుంటుందని కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు అన్నారు కోరుట్ల పట్టణ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నియోజకవర్గంలోనీ కోరుట్ల పట్టణ మండలానికి సంబంధించిన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ చేశారు. 7 లక్షల 35 వేల 500 రూపాయల విలువ గల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను కోరుట్ల వ్యవసాయ మార్కెట్ లో పంపిణీ చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పేద మధ్య తరగతి ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తుందని అందులో భాగంగానే ప్రజలకు అనారోగ్య సమస్య వల్ల బాధపడుతున్న వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు ఆసుపత్రిలో చికిత్స కోసం ఖర్చైనా వైద్య ఖర్చులను ముఖ్యమంత్రి సహాయనిది ద్వారా అందజేయడం జరుగుతుందని ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందన్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కులగణన చేపట్టి భారత దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు దీనికి సానుకూలంగా స్పందించిన ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా గులగణన చేపట్టాలని నిర్ణయం తీసుకోవడం చారిత్రాత్మకమైన నిర్ణయమని కులగణన త్వరగా చేపట్టి రాబోయే ఎన్నికల్లో కులగణనకు అనుకూలంగా రిజర్వేషన్లు చేపట్టాలని కోరుకుంటున్నామన్నారు ఈకార్యక్రమంలో జువ్వాడి నర్సింగరావు తోపాటు కోరుట్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పన్నాల అంజిరెడ్డి కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్ పట్టణ మండల కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల నాయకులు కార్యకర్తలు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు
