కోరుట్ల బార్ అసోసియేషన్ అధ్యక్షులు బైరి విజయ్ కార్యవర్గ సభ్యులకు ఘన సన్మానం
రణం: న్యూస్ కోరుట్ల: మే 3,సామాన్యులకు అండగా కోరుట్ల బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గం వుండాలని కోరుతూ నూతన అధ్యక్షులు బైరి విజయ్ కుమార్, ఉపాద్యక్షులు కస్తూరి రమేష్, కార్యదర్శి కొంపెల్లి సురేష్ లను మరియు కార్యవర్గ సభ్యులను స్వేచ్ఛ సామాజిక సంస్థ పక్షాన ఘనంగా సన్మానించారు.
శనివారం సి ప్రభాకర్ గ్రంథాలయంలో స్వేచ్ఛ సాహిత్య సామాజిక సంస్థ అధ్యక్షులు రాస భూమయ్య అధ్యక్షతన జరిగిన అత్మీయ అభినందన సభలో పాల్గొన్న తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పేట భాస్కర్ మాట్లాడుతూ న్యాయవాదులు తమ వృత్తి పట్ల ప్రగాఢ విశ్వాసంతో ముందుకు వెల్లుతారని దేశంలోని ప్రతి పౌరుడికి రాజ్యాంగంలో కల్పించిన హక్కుల ప్రకారం కోర్టులో న్యాయం జరగలంటే లాయర్ల దే కీలక పాత్ర అన్నారు. కోరుట్లలో నిర్మాణం అవుతున్న కోర్ట్ సొంత భవనాన్ని తొందరలో అందుబాటులోకి తేవాలని నూతన కమిటీని కోరారు. ప్రెస్ డే సందర్భంగా అందుబాటులో వున్న పాత్రికేయులు అల్లె రాము, సాంబారు మహేష్ లను ఘనంగా సన్మానించారు. ఈకార్యక్రమంలో న్యాయవాదులు చెన్న విశ్వనాథం, వొటారికారి శ్రీనివాస్,బద్ది నర్సయ్య, కడకుంట్ల సదాశివ్, గొనె సదానందం, పషియెద్దిన్, నాగనిర్మల, రాసబత్తుల రాజశేఖర్ సంస్థ నాయకులు రుద్ర నాగరాజు,రాస గౌతం, శ్యామ్ సుందర్, భూపెల్లి నగేష్, ముల్క ప్రసాద్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

