టిడిపిని బలోపేతం చేసి పూర్వ వైభవం తీసుకొస్తాం… మనకొండూరు టిడిపి ఇంచార్జ్ దామెర సత్యం

రణం: న్యూస్: గన్నేరువరం, ఏప్రిల్ 26
శనివారం రోజున మానకొండూరు నియోజకవర్గం లోని గన్నేరువరం మండలం గుండ్లపల్లి గ్రామ కేంద్రంలో తెలుగుదేశం పార్టీ 2024-26 కు గాను సభ్యత్వం తీసుకున్న నాయకులకు, కార్యకర్తలకు డిజిటల్ సభ్యత్వ కార్డులను రాష్ట్ర పార్టీ మాజీ అధికార ప్రతినిధి, అడ్ హక్ కమిటీ సభ్యులు దామెర సత్యం నాయకత్వంలో పంపిణీ చేయడం జరిగినది.ఈ సందర్భంగా దామెర సత్యం మాట్లాడుతూ త్వరలో గ్రామ, మండల కమిటీలు ఏర్పాటు చేయడం జరుగుతుందని, కమిటీలలో పదవులు పొందిన వారు పార్టీని బలోపేతం చేస్తూ, పార్టీకి పూర్వవైవం తీసుకురావడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరడమైనది.ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ గుండా పరశురాం గౌడ్ టిడిపి నాయకులు రాజా గౌడ్, చింతల వెంకటేష్, పీ. పోచయ్య, కట్కూరి అంజిరెడ్డి, డి మల్లేశం, వడ్లకొండ శ్రీనివాస్, పి మల్లయ్య, వి మల్లేశం తదితర నాయకులు పాల్గొనడం జరిగింది.