ప్రైవేట్ హాస్పిటల్స్ నియమ నిబంధనలు పాటించాలి
జిల్లా మాతా శిశు సంరక్షణ అధికారి డాక్టర్ జైపాల్ రెడ్డి
రణం: న్యూస్ జగిత్యాల: ఏప్రిల్ 25 ప్రైవేట్ ఆస్పత్రులు నియమ నిబంధనలు పాటించాలని జిల్లా మాత శిశు సంరక్షణ అధికారి డాక్టర్ జైపాల్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం రెవెన్యూ డివిజనల్ అధికారి మధుసూదన్ తో కలిసి ప్రైవేట్ ఆస్పత్రులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రైవేట్ ఆస్పత్రులు ,స్కానింగ్ సెంటర్స్ నిబంధనలు అతిక్రమించకుండా ప్రజలకు వైద్యం అందించాలని, ప్రతి నెల ఫారం ఎఫ్ లను ఆన్లైన్లో సబ్మిట్ చేసిన తర్వాత ఒక కాపీ వారికి కేటాయించిన పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఐదవ తారీకు లోపల సబ్మిట్ చేయవలెనని తెలిపారు. స్కానింగ్ చేసే చోట పేషంట్లకు కనబడే విధంగా లింగ నిర్ధారణ చేయడం చట్టరీత్యా నేరమని తెలిపే ఫ్లెక్సీలను అతికించవలెనని, సిజేరియన్ ఆపరేషన్ జరిగినట్టయితే సి సెక్షన్ ఆడిట్ ఫార్మ్స్ జిల్లా కార్యాలయంలో సమర్పించవలెనని తెలిపారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఎడ్యుకేటర్స్ కటుకం భూమేశ్వర్, తరాల శంకర్ సూపర్వైజర్ శ్యామ్ పాల్గొన్నారు.
