కోరుట్ల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఉగ్ర మూకల దాడిని ఖండిస్తూ నిరసన…
క్రొవ్వొత్తులు వెలిగించి సంతాపం..
*ఉగ్రవాద మూర్ఖత్వానికి మతం ప్రామాణికమైంది..
*మతం పేరుతో మారణ హోమం సృష్టించాలనుకోవడం అవివేకం..
రణం: న్యూస్ కోరుట్ల:ఏప్రిల్ 24,
జమ్మూ కాశ్మీర్ పహాల్గాం లో ఉగ్రమూకల దాడిని ఖండిస్తూ కోరుట్ల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం పట్టణం లోని అంబెడ్కర్ విగ్రహం వద్ద భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఉగ్రమూకలను ఉరితియ్యాలి అని నినాదాలు చేస్తూ.మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ క్రొవ్వొత్తులు వెలిగించారు. . ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ముక్కెర చంద్రశేఖర్ మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ లో ఉగ్రవాదుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు ఆయన తెలిపారు. అలాగే దాడిలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కుల, మత, ప్రాంత భేదాలు లేకుండా అన్నదమ్ముళ్ల కలిసిమెలిసి బతుకుతున్న భారతదేశంలో మతం పేరుతో ఉగ్ర మూకలు మారణ హోమం సృష్టించాలనుకోవడం అవివేకమన్నారు. పర్యాటకులను, సామాన్య ప్రజలను చుట్టూ ముట్టి ఆటవికంగా హత్య చేసి గెలిచామ నుకోవడం పిరికిపందల చర్యగా అభివర్ణించారు. ఉగ్ర మూకల దాడిలో ఆగిన ఊపిరి ప్రతి భారతీయుల్లోనూ ఉద్రేకాన్ని రగిలించిందన్నారు. ప్రశాంతంగా ఉన్న జమ్మూ కాశ్మీర్లో మతం ముసుగులో దాడి చేసిన మతోన్మాద ఉగ్రవాదుల చర్యలను, దాడిని ప్రపంచ దేశాలు ముక్తకంఠంతో ఖండిస్తున్నాయని చెప్పారు . ఉగ్ర మూకల దాడి ఇదొక క్రూరమైన , హేయమైన , అమానవీయమైన చర్య అని పేర్కొన్నారు. మతం పేరుతో దాడులకు తెగ బడిన ఉగ్రమూకల ఉద్దేశాలు ఎప్పటికీ విజయవంతం కాలేవన్నారు. ఉగ్రమూకల రియాక్షన్ కు భారత ప్రభుత్వం సరైన సమాధానం చెప్పే పనిలో ఉందనీ, ఉగ్రవాదులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఉగ్రవాదులు ఇలాంటి దొంగ దెబ్బలతో భారతీయుల ఆత్మస్థైర్యాన్ని దేబ్బ తీయలేరని , భారతదేశం ఎవరికి తలవంచదని, ధైర్యంగా నిలుస్తుందన్నారు. ఈ నిరసనలో జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర నాయకులు గంగుల రాంగోపాల్,కోరుట్ల ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి ఆకుల మల్లికార్జున్,యూనియన్ జిల్లా నాయకులు షికారి రామకృష్ణ,అంజు గౌడ్,సీనియర్ పాత్రికేయులు చావ్లా నవీన్ చేటపల్లి లక్ష్మణ్ కటకం గణేష్ గుండేటి రాజు,సామల్ల శ్రీనివాస్, సాజిద్ అలీ ,శ్రీకాంత్ బొడ్డురి సతీష్,ఇలయాజ్ ఖాన్, మర్రి సంతోష్,షికారి గోపి బలిజ సంతోష్,రాజేందర్,ఆదినారాయణ,అనాస్ కటకం ప్రేమ బోగ నవీన్, నంద్యాదపు శ్రీనివాస్,అబ్దుల్ రబ్,అల్లే సతీష్ నామాల రాకేష్,తొగిటి లక్ష్మణ్,సలాఉద్దీన్ కోటేష్ సిసింద్రీ రాజేంద్ర ప్రసాద్ షైక్ నజ్జు పాత్రికేయులు పాల్గొన్నారు.


