జిల్లా పరిషత్ పాఠశాలలో ఉత్తీర్ణత వేడుకలు…


రణం: న్యూస్ కోరుట్ల: ఏప్రిల్23,
పి ఎం శ్రీ జిల్లా పరిషత్ బాలికల పాఠశాల కల్లూరు రోడ్, కోరుట్లలో వార్షిక ఫలితాల వేడుకలు, తల్లితండ్రుల ఉపాధ్యాయుల సమావేశం వేసవి కాలములో తీసుకోవలిసిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమాలు జరిగాయి. పోటీ ప్రపంచంలో విద్యార్థులను ఆకర్శించడానికి పాఠశాల బృందం చేస్తున్న కృషిని పిల్లల తల్లీ తండ్రులు ఉపాధ్యాయుల సమావేశంలో పాల్గొన్నవారు ప్రశంసించారు. వేసవిలో ఎండ వేడిమి నుంచి పిల్లల్ని కాపాడుకోవాలని, వడదెబ్బ తగిలినప్పుడు గ్లూకోజ్ తయారు చేయు విధానంను అవగాహన సదస్సులో పాల్గొన్న డా.బోగ శంకర్ వివరించారు. తదుపరి సర్టిఫికెట్ డే నిర్వహించి విద్యార్ధినీ విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేసారు. ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల చైర్ పర్సన్ అంజమ్మ, పిటీఏ సభ్యులు పిల్లల తల్లితండ్రులు, ప్రముఖ వైద్యులు శివ సాయి హాస్పిటల్ అధినేత డా.బోగ శంకర్, మాజీ కౌన్సిలర్ తిరుమల గంగాధర్, ఉపాధ్యాయనీ, ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు కృష్ణ మోహన్ రావు తెలిపారు.