న్యాయవాదుల సంక్షేమం కోసమే బార్ కౌన్సిల్.
రణం ప్రతినిధి, మెట్ పల్లి, ఏప్రిల్ 23.న్యాయవాదుల సంక్షేమం కోసమే బార్ కౌన్సిల్ ఉందని కౌన్సిల్ సభ్యులు కాసుగంటి లక్ష్మణ్ కుమార్ అన్నారు. బుధవారం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సీవోపి అవగాహనా సదస్సులో ప్రసంగించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, ఇప్పుడు మారిన బార్ కౌన్సిల్ నిబంధనల ప్రకారం ప్రతి న్యాయవాది ఐదేళ్లకు ఒకసారి ప్రాక్టీస్ చేస్తున్నట్టు సర్టిఫికెట్ పొందాలన్నారు. కొత్తగా సభ్యత్వం నమోదు చేసుకునే న్యాయవాదులువెల్ఫేర్ ఫండ్ చెల్లించాలని సూచించారు. కొత్తగా వచ్చే న్యాయవాదులు డ్రెస్ కోడ్, ప్రవర్తన నిబందనలు పాటించాలని అన్నారు. అనంతరం ఆయనకి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ కార్యక్రమం లో బార్ అసోసియేషన్ అధ్యక్షులు కంతి మోహన్ రెడ్డి, ఉపాధ్యక్షులు తోగిటి రాజశేఖర్, ప్రధాన కార్యదర్శి పసునూరి శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శి గజేల్లి రాందాస్ కల్చారల్ కార్యదర్శి సుమలత, స్పోర్ట్స్ కార్యదర్శి బిగుర్ల శంకర్, ఈసి మెంబర్లు మన్నె గంగాధర్, గురిజెలా గోపి, గజాబింకర్ వెంకటేష్ మరియు బార్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.
