చిన్నారి దేశభక్తి భేష్…
జమ్ము కాశ్మీర్ లో జరిగిన ఉగ్రదాడిపై వెల్లువెత్తిన నిరసనలు…
రణం: న్యూస్ కోరుట్ల: ఏప్రిల్ 23, జమ్ము కశ్మీర్ లో జరిగిన ఉగ్ర దాడిని ఖండిస్తూ..కోరుట్ల లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు.ఎలాంటి సిద్ధాంతం లేని ముష్కర మూక సాధారణ పౌరులను చంపడం దుర్మార్గంప్రజల ప్రాణాలను బలిగొని మతము పేరుతో దాడులు చేయడం దుర్మార్గం అని ఉగ్రదాడికి దిగిన దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని ఉగ్రదాడిలో తమ ఆత్మీయుల ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని రోడ్డు పై బైఠాయించి క్రొవ్వొత్తులతో నివాళులు అర్పించారు.
ఈ నిరసన కార్యక్రమం లో చిన్నారి పట్టుకున్న ప్లకార్డు పలువురి మనసులో ఆలోచనల్ని రేకెత్తించింది..
