ప్రభుత్వ మైనారిటీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలో మెరిసిన ఆణిముత్యం
రణం: న్యూస్ కోరుట్ల,:: ఏప్రిల్ 23
కోరుట్ల పట్టణంలోని ప్రభుత్వ మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాలలో నిన్న విడుదల అయినటువంటి ఇంటర్మీడియట్ ఫలితాల్లో భాగంగా కోరుట్ల పట్టణానికి చెందిన ప్రముఖ జర్నలిస్ట్ మహమ్మద్ అబ్దుల్ ముసవీర్ కుమారుడు మహమ్మద్ ముసాయిబ్ 918/1000 మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలిచాడు.. ప్రభుత్వ మైనారిటీ పాఠశాల, కళాశాలలో ఐదవ తరగతి నుంచి విద్యను అభ్యసించి నిన్న విడుదలైనటువంటి ఫలితాల్లో మహమ్మద్ ముసాయిబ్ ప్రతిభ కనబరిచాడు.. చిన్నతనం నుండి ప్రభుత్వ పాఠశాల హైదరాబాద్ లోని సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ లో విద్యను అభ్యసించి ప్రైవేటు విద్యార్థులకు దీటుగా మార్కులు సాధించడం పట్ల తల్లి దండ్రులు మరియు కుటుంబ సభ్యులు ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు…