పిల్లలకు పౌష్టికాహారంపై అవగాహన అవసరమే
ప్రధానోపాధ్యాయులు నూనావత్ రాజు
రణం న్యూస్ కోరుట్ల, ఏప్రిల్ 23: బాల్యం నుండే బడీడు పిల్లలకు పౌష్టికాహారంపై అవగాహన కల్పించడం అవసరమే నని కోరుట్ల గడి ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు నూనావత్ రాజు అన్నారు. పోషణ పక్షోత్సవాల్లో భాగంగా బుధవారం మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మెట్ పల్లి ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో కోరుట్ల ప్రభుత్వ పాఠశాలలో పోషణ జాతరలో భాగంగా పిల్లలకు చిరుధాన్యాలపై అవగాహన కల్పించి వ్యాస రచన పోటీలు నిర్వహించి ప్రథమ, ద్వితీయ
బహుమతులు ఆర్. హన్సిక, దేశవేణి ధరణికి ప్రధానం చేశారు. పోషణ జాతరలో భాగంగా ఏర్పాటు చేసిన పిల్లల పెరుగుదల పర్యవేక్షణ, చేతుల పరిశుభ్రత, మిషన్ భగీరథ నీటి ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అంగన్ వాడి టీచర్లు చింత అరుణ, శీలం హిమగిరి, అన్నం లక్ష్మి, వకుళభరణం ప్రేమలత, కే. ప్రసన్నలక్ష్మి, రేంజర్ల రాజమణి, పోతుగంటి పద్మ తదితరులు పాల్గొన్నారు.
