సెలవులకు వచ్చిన విద్యార్థులు జాగ్రత్త
రణం :న్యూస్ మెట్ పల్లి: ఏప్రిల్ 23.ఈనెల 24 నుండి జూన్ 12 వరకు ప్రభుత్వం వేసవి సెలవులు ఇవ్వడంతో విద్యార్థులంతా తమ ఊర్లోకి వస్తున్న విద్యార్థిని విద్యార్థు
లు జాగ్రత్తగా ఉండాలని గురుకుల రాష్ట్ర పేరేంటి సభ్యుడు గోరుమంతుల సురేందర్ అన్నారు. ఈ వేసవి సెలవులను మీ భవిష్యత్తుకు ఉపయోగపడే కోడింగ్ భాష గాని, కంప్యూటర్, మగ్గం వర్క్, చెస్, మీకు ఏది అందుబాటులో ఉంటే అది నేర్చుకోండి మీకు ఇష్టమైన ఆటలు కూడా ఆడుకోండనీ ఉన్నారు.కానీ చెరువుల దగ్గరికి బావుల దగ్గరికి కెనాల్ దగ్గరికి గోదారి దగ్గరికి వెళ్ళవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం మీకు తెలిసి తెలియక స్నేహితులతో అక్కడికి వెళ్లి మీ ప్రాణాలకు ఇబ్బంది కరం చేసుకోవద్దు అని తెలిపారు.మీ అమ్మానాన్నలను జీవితాంతం దుఃఖపడే పని చేయవద్దని విద్యార్థిని విద్యార్థులను కోరుతున్నాం. అమ్మానాన్నల కూడా మీ పిల్లలపై పూర్తి బాధ్యతతో స్కూల్ సెలవులు పూర్తి అయ్యే వరకు మీ పిల్లలను కంటికి రెప్పలా ఇంటిదగ్గర చూసుకోవలసిన బాధ్యత మీపై ఉందనీ తెలిపా
రు.మీకు ఎన్ని పనులు ఉన్నా పిల్లలను ఇంటి నుండి బయటకు రావద్దని చెప్పి మీరు పనులకు వెళ్లాలని కోరుతున్నాంప్రతి గ్రామంలో ఉండే విడిసీలు గ్రామ సెక్రెటరీ లుఉదయం సాయంత్రం మైకుల ద్వారా పిల్లలు చెరువుల దగ్గరికి వాగుల దగ్గరికి గోదారి దగ్గరికి కెనాల్ దగ్గరికి బావుల దగ్గరికి వెళ్ళవద్దని ప్రచారం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం పట్టణాలలో ఉండే విద్యార్థిని విద్యార్థుల కోసం మున్సిపల్ వాహనాల ద్వారా వాడవాడలో ప్రచారం చేయాలనికోరుతున్నాంగ్రామాల్లోని వీడీసీలు, గ్రామ సెక్రటరీలు, మున్సిపల్ కమిష
నర్లు జిల్లా అధికారులు అందరూ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని విద్యార్థులు సెలవులు ముగించుకొని స్కూళ్లకు వెళ్లే వరకు ప్రతి ఒక్కరు తమ బాధ్యత తీసుకోవాలని గోరు మంతుల సురేందర్ కోరుతున్నారు.
