ఇంటర్మీడియట్ లో స్టేట్ ద్వితీయ శ్రేణి మార్కులు సాధించిన నేహ
రణం: న్యూస్ కోరుట్ల: ఏప్రిల్ 22

కోరుట్ల పట్టణం ఆరవ వార్డు యకీన్పూర్ గ్రామానికి చెందిన ఉరుమడ్ల శ్రీనివాస్ వాణి దంపతుల కూతురు నేహా ఇంటర్ ఎంపీసీ మొదటి సంవత్సరం ఫలితాలలో 470 మార్కులకు గాను 466 ద్వితీయ శ్రేణి మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో మంచి గుర్తింపు తెచ్చిందని కోరుట్ల గౌతమ్ మోడల్ స్కూల్ పాఠశాల కరస్పాండెంట్ ప్రవీణ్ ఆనందం వ్యక్తం చేశారు. హైదరాబాద్ శ్రీ చైతన్య కళాశాలలో చదువుతున్న ఉరుమడ్ల నేహ ఎస్ఎస్సి లో 9.5 ఉత్తీర్ణత సాధించి ఇంటర్మీడియట్ లో హైదరాబాద్ లోని మియాపూర్ బ్రాంచ్ లో శ్రీ చైతన్య కళాశాలలో చదివి అత్యుత్తమ ప్రతిభ కనబరచి 466 మార్కులు సాధించడం గర్వకారణమని గౌతమ్ మోడల్ స్కూల్ పాఠశాల యాజమాన్యం ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఉరుమడ్ల నేహ తల్లిదండ్రులు శ్రీనివాస్ వాణి తమ కూతురు మంచి ఉత్తీర్ణత సాధించి రాష్ట్రస్థాయిలో గుర్తింపు తీసుకు వచ్చినందుకు మిఠాయిలు తినిపించి కూతురును ఆశీర్వదించారు.