మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల వార్షికోత్సవం..
రణం: న్యూస్: గన్నేరువరం, ఏప్రిల్ 22
గన్నేరువరం మండల కేంద్రంలోని ప్రైమరీ స్కూల్ లో మంగళవారం పాఠశాల వార్షికోత్సవం జరిగింది. ఇందులో భాగంగా ఐదవ తరగతి విద్యార్థులకు కన్వర్షన్ విధానంలో ప్రగతి పత్రం ఎంఈఓ కే.రామయ్య, విద్య కమిటీ చైర్మన్ రాపోల్ లావణ్య చేతుల మీదుగా అందజేశారు, ఎంఈఓ రామయ్య మాట్లాడుతూ ప్రభుత్వం నుండి వచ్చే సదుపాయాలను పాఠశాలకు పూర్తిస్థాయిలో కల్పిస్తున్నమని హామీ ఇచ్చారు.బడిబాటకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. విద్యార్థి విద్యార్థులతో సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఆర్ సాయి శిరీష, ఎంఈఓ కే రామయ్య, ఏఏపిసి చైర్ పర్సన్ రాపోల్ లవణ్య, పాఠశాల ఉపాధ్యాయులు బుర్ర మధు, ఆర్ వేణుగోపాల్, జె ప్రసన్న, పి స్వరూప,వి అనిత,జి తిరుపతి విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
