ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దాం
ఐసీడీఎస్ సీడీపీఓ కాశ్ పాక మణెమ్మ
రణం న్యూస్ కోరుట్ల, ఏప్రిల్ 22: ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి అంకితభావంతో కృషి చేద్దామని మెట్ పల్లి ఐసీడీఎస్ సీడీపీఓ కాశ్ పాక మణెమ్మ అన్నారు. కోరుట్ల పట్టణంలోని 24వ వార్డు గోవిందగిరినగర్, పద్మపురివాడ అంగన్ వాడి కేంద్రంలో మంగళవారం పోషణ పక్వాడ్, పోషణ పక్షంలో భాగంగా తల్లులకు పౌష్టికాహారం చిరుధాన్యాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీడీపీఓ కాశ్ పాక మణెమ్మ, సూపర్ వైజర్ అలవాల భారతి మాట్లాడుతూ అంగన్ వాడి కేంద్రాల ద్వారా అందించే సేవలను గర్భిణీ, బాలింతలు, తల్లులు వినియోగించుకోవాలని సూచించారు. ఆరోగ్యకరమైన జీవనానికి సంపూర్ణ పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవాలని వివరించారు. పిల్లల ఎదుగుదలకు పోషక విలువలతో కలిగిన ఆహారం తీసుకోవాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వ్యాధి నిరోధక టీకాలు, తక్కువ బరువు ఉన్న పిల్లలు లోపపోషణ లేకుండా శ్రద్ధ కనబర్చాలని అన్నారు. అంగన్ వాడి కేంద్రాల్లో ఆదించే పూర్వ ప్రాథమిక విద్య గురించి తల్లులకు పరిపూర్ణ అవగాహన కల్పించారు. పిల్లలకు మంచి అలవాట్లు నేర్పించాలని, సంభాషణ, ఆట, కథ ద్వారా పిల్లలకు మానసిక మేధో వికాసం పెరుగుతుందని తెలిపారు. అనంతరం గర్భిణీ స్త్రీలకు సీమంతం, ఆరు నెలలు నిండిన పిల్లలకు అన్నప్రసన చేయడం జరిగిందని వెల్లడించారు. ఎత్తు, బరువు, జబ్బ చుట్టు కొలత తీసుకోవాలని సీడీపీఓ కాశ్ పాక మణెమ్మ, సూపర్ వైజర్ అలవాల భారతి సూచించారు. ఈ కార్యక్రమంలో అంగన్ వాడి టీచర్ సుజాత, లక్షీ, ఏఎన్ఎం, ఆశలు పాల్గొన్నారు.
