పల్లె పల్లె నుండి సైనికులు కదలాలి..
చలో వరంగల్ సభకు పెద్ద సంఖ్యలో వచ్చి విజయవంతం చేయాలి…
మేడిపల్లి మండల కేంద్రంలో పార్టీ కార్యకర్తలతో చల్మెడ..
రణం::న్యూస్ ఏప్రిల్ 21 :మేడిపల్లి మండలం:

ప్రతి పల్లె నుండి బిఆర్ఎస్ సైనికులు భారీ సంఖ్యలో కదిలి ఈనెల 27న వరంగల్ ఎల్కతుర్తి లోజరిగే బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు హాజరై విజయవంతం చేయాలని బిఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జ్ చల్మెడ లక్ష్మీనరసింహారావు అన్నారు.సోమవారం జగిత్యాల జిల్లా మేడిపల్లి మండల కేంద్రంలో ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చల్మెడ మాట్లాడుతూ ఈ సభలో మన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు కెసిఆర్ ప్రసంగించనున్నారని, కావున ఈ బహిరంగ సభకు పెద్ద సంఖ్యలో కార్యకర్తలందరూ కలిసికట్టుగా రావాలన్నారు. బిఆర్ఎస్ పార్టీ స్థాపించి 25వసంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకోవాలన్నారు. గ్రామ గ్రామాన ఈనెల 27న బిఆర్ఎస్ జండా ఎగురవేసి వరంగల్ సభకు తరలి వెళ్లాలని పిలుపునిచ్చారు. అనంతరం మండల నాయకులతో కలిసి బహిరంగ సభ పోస్టర్ ను ఆవిష్కరించారు. సమావేశంలో ఉమ్మడి మేడిపల్లి మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, టిఆర్ఎస్ పార్టీ తాజా మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ కార్యకర్తలు ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.