స్వచ్ఛభారత్ నినాదాలతో
ఇంటి నెంబర్లు, వీధి బోర్డులు
లోగో ఆవిష్కరించిన కేంద్ర మంత్రి బండి సంజయ్
రణం: న్యూస్ కరీంనగర్,: ఏప్రిల్, 21
ఇంటి నెంబర్లు, వీధులకు బోర్డులు లేక చిరునామా విషయంలో ఎదురవుతున్న ఇబ్బందులను అధిగమించేందుకు శాశ్వత ఇంటి నెంబర్లు, వీధిబోర్డుల ఏర్పాటుకురంగం సిద్ధమైంది.స్వచ్ఛభారత్ లోగోతో, పరిసరాల పరిశుభ్రతను వివరించే నినాదాలతో కూడిన ఈ బోర్డులను కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆవిష్కరించారు.కేంద్ర ప్రభుత్వ స్వచ్చ భారత్ కార్యక్రమానికి ఇంటి నెంబర్లు,వీధి బోర్డుల ఏర్పాటు ప్రక్రియ ఉపయుక్తంగా ఉంటుందనే
ఆశాభావాని కేంద్రం మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యక్తం చేశారు.రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ,పట్టణ ప్రాంతాలలో స్వచ్ఛభారత్ నినాదాలు, పన్నుల చెల్లింపు వివరాలతో కూడిన శాశ్విత ఇంటి నెంబర్ బోర్డులు ఏర్పాటు చేసేకాంట్రాక్టును కరీంనగర్ కు చెందిన మారుతి ఇండస్ట్రీస్ వర్కర్స్ వేల్ఫేర్ సొసైటీ నిర్వహకులు తిప్పారపుఅంజనేయులుకుప్రభుత్వంఅప్పగించింది.పట్టణ ప్రాంతాలలో ఇళ్లకు నెంబర్లు, వీధులను సూచించే బోర్డులు లేకపోవడంతో చిరునామా వెతుక్కోవడం
కష్టంగా పరిణమించిందనిసంజయ్ ఈ సందర్భంగా అన్నారు.అత్యవసర సేవలకు, ప్రభుత్వ ప్రభుత్వేతర కార్యక్రమాల ఉత్తర, ప్రత్యుత్తరాలకు,పాలనాపరమైన
సమాచారం చేరవేతకు ప్రస్తుత ప్రక్రియ ఎంతగానో ఉపయోగ పడుతుందన్నారు.సామాన్య ప్రజలు సైతం సాంకేతికతను వినియోగిస్తున్న ప్రస్తుత తరుణంలో ఆహార,వస్తు సామాగ్రి పంపిణీ చేసే సిబ్బందికి
ఇంటి నెంబర్లు, వీధులను సూచించే బోర్డులు సమయాన్ని ఆదా చేయడమే కాకుండా, నేరుగా గృహ వినియోగదారుని ఇంటికి చేరుకొనే మార్గాన్ని ఏర్పరుస్తాయని అన్నారు.బోర్డులు ఇంటి యజమానులను పన్నుల చెల్లింపు విషయంలో అప్రమత్తం చేసేందుకు ఉపయోగ పడతాయన్నారు.
ఇంటి పన్నులు సకాలంలో చెల్లించాలని,పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని,స్వచ్ఛ తెలంగాణకు సహకరించాలని,ప్లాస్టిక్ వాడకాన్ని నిషేదించాలనే సూచలను ఈ బోర్డులపై ముద్రించడం జరిగిందన్నారు.
ప్రజలు వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమానికి అధికార యంత్రాంగం కూడా పూర్తిగా సహాయ,సహాకారాలు అందించాలని మంత్రి కోరారు.ఈ కార్యక్రమంలో తిప్పారపు రవివర్మ, బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి ఎడబోయిన రామక్రిష్ణారెడ్డి పాల్గొన్నారు.

