ఆది శ్రీనివాస్ ను సన్మానించి న జువ్వాడి కృష్ణారావు
రణం: న్యూస్ కోరుట్ల : ఏప్రిల్ 21వేములవాడ శాసనసభ్యుడు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాజీ వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు భారత పౌరసత్వం పై చేసిన న్యాయపోరాటం లో దేశ అత్యున్నత న్యాయస్థానం ఆది శ్రీనివాస్ కు అనుకూలంగా తీర్పునివ్వడం చెన్నమనేని రమేష్ భారత పౌరుడు కాదు అని పేర్కొన్న సంగతి తెల్సిన విషయమే.ఆది శ్రీనివాస్ కు 25 లక్షలు చెల్లించాల్సిందిగా అదేవిధంగా న్యాయ ప్రాధికారిక సంస్థకు 5 లక్షల రూపాయలు రమేష్ బాబు చెల్లించాల్సిందిగా గతంలో ఇచ్చిన తీర్పులో దేశ సర్వోన్నత న్యాయస్థానం పేర్కొనగా ఈరోజు హైదరాబాద్ లో రమేష్ బాబున్యాయవాదులద్వారఆది శ్రీనివాస్ కు 25 లక్షల రూపాయలు చెల్లించారు ఈ సందర్భంగా జువ్వాడికృష్ణరావు ఆది శ్రీనివాస్ ను సన్మానించి అభినందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత పౌరసత్వం లేనప్పటికి చె న్నమనేని రమేష్ బాబు తప్పుడు అఫిడవిట్ సమర్పణ ద్వారా శాసనసభ్యునిగా ఎన్నికై ప్రభుత్వ నుండి జీతభత్యాల రూపంలో తీసుకున్న డబ్బులు మొత్తం రాష్ట్ర ప్రభుత్వం రికవరీ చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో బొమ్మ శ్రీరాo చక్రవర్తి పాల్గొన్నారు
