కోరుట్ల ట్రస్మా అధ్యక్షునిగా ఎంఏ భారీ
రణం: న్యూస్ కోరుట్ల: ఏప్రిల్20
కోరుట్ల పట్టణ ట్రస్మా అధ్యక్షునిగా కేరళ హై స్కూల్ కరస్పాండెంట్ ఎంఏ భారీ ప్రధాన కార్యదర్శి గా గుజ్జేటి వెంకటేష్, కోశాధికారి గా తంగళ్లపల్లి దీపక్ లను ట్రస్మా సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు. ఈ సందర్బంగా ఎన్నికైన సభ్యులు మాట్లాడుతూ కోరుట్ల ట్రస్మాను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో సాగేలా కృషి చేస్తామని రాష్ట్ర, జిల్లా సంఘాలకు అనుబందంగా ఉంటూ పట్టణం లోని ట్రస్మా లో ఉన్న పాఠశాలల సమస్యలను మా దృష్టికి తే గలిగితే వాటిని పరిష్కరించే విధంగా కృషి చేస్తామని మా మీద నమ్మకంతో మమ్మల్ని ఎన్నుకొన్న ట్రస్మా కుటుంబ సభ్యులందరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం లో జగిత్యాల జిల్లా ట్రస్మా గౌరవ అధ్యక్షులు భోగ రవి ప్రసాద్, అధ్యక్షులు శ్రీధర్ రావు, కోరుట్ల ట్రస్మా సభ్యులు తుమ్మనాపల్లి సత్యనారాయణ, బండి మహాదేవ్ కూడేలు రాజేంద్ర ప్రసాద్, పిన్నం శెట్టి శ్రీధర్, దామోదర్,సిద్ధార్థ, చౌకి రమేష్ ఎం. ఏ కిజర్, కళాశాలల వ్యవస్థాపకులు ప్రవీణ్, రాజేష్, మరియు సభ్యులు పాల్గొని నూతనంగా ఎన్నిక కాబడిన కార్యావర్గాన్ని సన్మానించారు.
