జై బాపు జై భీమ్ జై సంవిధాన్…
ప్రజాస్వామ్య పరిరక్షణ కాంగ్రెస్ తోనే సాధ్యం…
కాంగ్రెస్ పార్టీ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ఇంటింటికి తీసుకెళ్లాలి…
రణం :న్యూస్ కోరుట్ల:ఏప్రిల్ 18,కోరుట్ల పట్టణ 7,8,9,వ వార్డులలో ఆయా వార్డు ఇన్చార్జ్ ల ఆధ్వర్యంలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా పాదయాత్ర కోరుట్ల నియోజకవర్గ ఇంచార్జి జువ్వాడి నర్సింగరావు ఆదేశాల మేరకు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్ పాల్గొన్నారు.ఈసందర్భంగా వ కార్యకర్తలతో గంగాధర్ జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమం పై భారతీయులమైన మేము మా రాజ్యాంగాన్ని అత్యంత పవిత్రమైనదని అన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తూ మన గొప్ప రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి చిత్తశుద్ధితో అంకితభావంతో అహర్నిశలు కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేయించారూ. కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని గ్రామ గ్రామాన వార్డు వార్డులలో ఇంటింటికి తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థులను గెలిపించాలని స్థానిక సంస్థల్లోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని కాబట్టి ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ప్రతి వార్డులో ర్యాలీ నిర్వహించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో వార్డ్ ఇంచార్జిలు ముత్యాల గంగాధర్ అయిండ్ల గణేష్ ఎడ్లరమేష్ ఈర బత్తిని దశరథం అన్నం అనిల్ ఎంబేరి నాగభూషణం ఆడెపు మధు పుప్పాల ప్రభాకర్ జిందమ్ లక్ష్మీనారాయణ బూరుగు రామస్వామి గౌడ్ ఎలిశెట్టి భూంరెడ్డి రాజోజి భూమయ్య మ్యాకల నర్సయ్య సోగ్రాభి నాజుముద్దీన్ ఎంబేరి సత్యనారాయణ చిటిమెల్లి రంజిత్ గుప్తా శ్రీరాముల అమర్ ఏ ఆర్ అక్బర్ మచ్చ కవిత చిట్యాల లక్ష్మీనారాయణ ఎతిరాజం నర్సయ్య కట్కమ్ దివాకర్ వాసం అజయ్ యటం అరుణ్ చిలువేరి విజయ్ తెడ్డు విజయ్ తునికి సాయి రాచకొండ నవీన్ గోపి జీకురి కిషోర్ కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల నాయకులు వార్డులలో మహిళలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

