కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ..

రణం: న్యూస్ కోరుట్ల:ఏప్రిల్18,,కోరుట్ల మండలం సంగేమ్, నాగులపేట గ్రామాలలో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు జై బాపు, జై భీమ్, జై సంవిధన్ కార్యక్రమం లో భాగంగా పాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంనికి ముఖ్య అతిథి గా కోరుట్ల కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇంచార్జ్ జువ్వడి నర్సింగరావు, అసెంబ్లీ ఈ ప్రోగ్రాము కోర్డినేటర్ కత్తి వెంకట స్వామి పాల్గొన్నారు ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ రాజ్యాంగ పరిరక్షణ ప్రతి ఒక్కరి భాద్యత అని అన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ ఆశయాలను, అహింస మార్గాన్ని గ్రామ గ్రామ న ప్రతి ఒకరు ఆచరించాల్సిన అవసరం వున్నది అని అన్నారు.పార్లమెంట్ సాక్షి గా అంబేద్కర్ ని అవమానించిన కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఖండిస్తున్నామని అన్నారు. అంబేద్కర్ ని అవమానించిన కేంద్ర మంత్రి అమిత్ షా ని మంత్రి వర్గం నుండి తొలగించాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అంబేద్కర్ రాసిన రాజ్యాంగని మార్చివేయాలని చూస్తుందని అన్నారు. రాజ్యాంగాన్ని రక్షించు కోవాల్సిన భాద్యత ప్రతి ఒక పౌరుడిపైన వున్నది అని అన్నారు. బడుగు బలహీన వర్గాలకు వర్గాలకు సామజిక న్యాయం కాంగ్రెస్ పార్టీ తోని సాధ్యం అని అన్నారు కాంగ్రెస్ పార్టీ సేవధాల్ అద్వర్యం లొ జెండా కార్యక్రమం ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లో ,కోరుట్ల మండలం కాంగ్రెస్ అధ్యక్షులు కొంతం రాజం, కోరుట్ల మార్కెట్ కమిటీ చైర్మన్ పన్నాల అంజిరెడ్డి,బీసీ సెల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గడ్డం వెంకటేష్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పెరుమాండ్ల సత్యనారాయణ, జిల్లా కాంగ్రెస్ సేవదల్ అధ్యక్షులు నాయిని సురేష్, సేవదల్ రాష్ట్రా కోశాధికారి శ్రీగద్దె నరహరి, కిసాన్ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి పోతుగంటి శంకర్ గౌడ్, ఎస్సీ సెల్ మండలాధ్యక్షుడు మంతెన నర్సయ్య, బీసీ సెల్ మండల అధ్యక్షుడు ముక్కెర లింబాద్రి, కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు బొల్లి నరసయ్య, పోతుగంటూ వెంకగౌడ్, పరుస తుకారాం,సింగిరెడ్డి నవీన్ రెడ్డి ముంజ రాజా గౌడ్, జక్కుల రాజం, రామచంద్ర రావు,M. D జనీల్, సింగిరెడ్డి శేఖర్ రెడ్డి, తీగల మహేష్ రెడ్డి, తదితర నాయకులు పాల్గొన్నారు