లింగంపేట లో బస్తీ దవాఖాన ప్రారంభించిన ఎం ఎల్ ఏ సంజయ్ కుమార్
రణం: న్యూస్ జగిత్యాల: ఏప్రిల్17,,గురువారం జిల్లా వైద్యాధికారి డాక్టర్ ప్రమోద్ కుమార్ తో కలిసి లింగంపేట బస్తీ దావఖానా ను స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ ఎం సంజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో మెరుగైన వైద్య సౌకర్యం కలిగించడానికి జగిత్యాల పట్టణంలో మరొక బస్తీ దవాఖానా ను ప్రారంభించడం జరిగిందని ప్రజలు దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇప్పటివరకు జగిత్యాల పట్టణంలో ఇస్లాంపుర తారక రామ్ నగర్ లో బస్తీ దవాకానాలు ఉన్నాయని ఇది మూడవదని తెలిపారు. అనంతరం జిల్లా వైద్యాధికారి డాక్టర్ కె ప్రమోద్ కుమార్ ఉపవైద్యాధికారి డాక్టర్ ఎన్ శ్రీనివాస్ ఎమ్మెల్యే తో క్షయ నివారణ కార్యక్రమంలో భాగంగా కరపత్రాలను మరియు ఐ ఈ సి మెటీరియల్ను ఆవిష్కరించారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ టీబి ని అరికట్టవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంద నీ అందరూ తమ వంతు సహకారం అంది స్తే “”టీబీ ఓడిపోతుంది – దేశం గెలుస్తుంది”” అనే నినాదాన్ని నిజం చేయవచ్చని ప్రజలకు ప్రజాప్రతినిధులకు సూచించారు. టీబి గురించి అందరూ చర్చించడం వల్ల క్షయ వ్యాధిగ్రస్తుల పట్ల వివక్షత చూపకుండా వారికి సరియైన ఉచిత చికిత్స అందేలాగా ప్రోత్సహించడమే కాకుండా అన్ని విధాల సహకరించిన వారిమవుతామని తెలిపారు.అంతేకాకుండా ప్రజా ప్రతినిధులు జిల్లాలోని వ్యాపారస్తులను స్వచ్ఛంద సంస్థలను భాగస్వాములను చేస్తూ క్షయ వ్యాధిగ్రస్తులకు పోషకాహార కిట్లను అందజేయించాలని తెలిపారు. ఎవరికైనా రెండు వారాలకు మించి దగ్గు, దగ్గినప్పుడు కళ్లెలో రక్తం పడడం, జ్వరం, రాత్రిపూట చెమటలు పట్టడం, బరువు తగ్గడం ,నీరసంగా ఉండడం మొదలగు లక్షణాలు ఉన్నట్లయితే దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి తేమడ పరీక్షలు చేయించుకోవాల్సిందిగా సూచించారు. క్షయ వ్యాధి నిర్ధారణ అయినట్లయితే ఆరు నుంచి తొమ్మిది నెలల్లో చికిత్స పూర్తికాలం వాడినట్లయితే వ్యాధి నయమవుతుందని తెలిపారూ. చికిత్స కాలంలో వారికి పౌష్టిక ఆహారం అందించడం కోసం నిక్షే పోషణ యోజన పథకం క్రింద ప్రతి నెల 1000 రూపాయలు వారి అకౌంట్ లో జమచేయబడతాయనిపేర్కొన్నారు.ఈకార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ ఏ శ్రీనివాస్ వైద్యాధికారీ డాక్టర్ శివకుమారి ,ప్రజా ప్రతినిధులు తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ ఆడువాళ సుజాత ,స్థానిక నాయకులు,ఎన్ హెచ్ ఎం డి పి ఓ రవీందర్ వైద్య సిబ్బంది పాల్గొన్నారు.


