ప్రజాస్వామ్య పరిరక్షణ కాంగ్రెస్ తోనే సాధ్యం…
కాంగ్రెస్ పార్టీ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ఇంటింటికి తీసుకెళ్లాలి…
రణం: న్యూస్ కోరుట్ల:ఏప్రిల్17,,,కోరుట్ల పట్టణ పలు వార్డులలో ఆయా వార్డు ఇన్చార్జ్ ల ఆధ్వర్యంలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా పాదయాత్ర నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్ పాల్గొన్నారు. ఈసందర్భంగా కార్యకర్తలతో గంగాధర్ జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమం పై భారతీయులమైన మేము మా రాజ్యాంగాన్ని అత్యంత పవిత్రమైనదిగా ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగంగా భావిస్తామని మాకు సర్వభౌమత్వ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగా నిర్మించుకోవడానికి సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచించాల్సిన అవసరం ఉన్నదని ఆయన అన్నారు. అందరికీ సమాన హక్కులు బాధ్యతలు రాజ్యాంగం కల్పించిందని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తూ గ్రామ గ్రామాన వార్డు వార్డులలో ఇంటింటికి తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఛైర్మెన్ పన్నాల అంజిరెడ్డి నయీమ్ సోగ్రాభి వార్డ్ ఇంచార్జిలు బలిజ రాజారెడ్డి పసుల క్రిష్ణ ప్రసాద్ తెడ్డు విజయ్ మోర్తాడ్ లక్ష్మీనారాయణ ముజబిత్ వసిద్ అన్నం అనిల్ ఎంబేరి నాగభూషణం ఆడెపు మధు జిందమ్ లక్ష్మీనారాయణ బద్ది మురళి పేట భాస్కర్ నాజుముద్దీన్ ఎంబేరి సత్యనారాయణ చిటిమెల్లి రంజిత్ గుప్తా చిట్యాల లక్ష్మీనారాయణ మ్యాదరి లక్ష్మణ్ కట్కమ్ దివాకర్ షహీద్ మొహ్మద్ షేక్ చిట్యాల అశోక్ సయ్యద్ అజర్ కండ్లె నరేష్ కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు


