లిటిల్ జీనియస్ హైస్కూల్ లో ఎన్.సి.సి. బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్
రణం :న్యూస్ కోరుట్ల: ఏప్రిల్17,స్థానిక లిటిల్ జీనియస్ హైస్కూల్ లో నేషనల్ క్యాడేట్ కాప్స్ రెండు సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్న సందర్భంలో ఎన్.సి.సి. 9 టి బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ ఏ.జయంత యూనిట్ ను బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన పెరేడ్స్ రికార్డులు , హాజరు పట్టికను పరిశీలించారు. క్లాసుల నిర్వహణ విధానాన్ని తెలుసుకున్నారు. ఎన్.సి.సి కి సంబంధించిన విషయాలను ప్యానెల్ ద్వారా వివరించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ బండి మహాదేవ్ , హైస్కూల్ ప్రిన్సిపాల్ రాధాకృష్ణ , ప్రైమరీ ప్రిన్సిపాల్ వినోద , ప్రీ-ప్రైమరీ ప్రిన్సిపాల్ సంధ్యారాణి , స్కూల్ థర్డ్ ఆఫీసర్ సంగ మహేష్ , విద్యార్థులు పాల్గొన్నారు.

