గల్లా పట్టిగుంజుకొచ్చి కొట్టిండ్రు..




మాజీ మున్సిపల్ కౌన్సిలర్ పై దాడి..
మున్సిపల్ అధికారులు ఆ మాజీ కౌన్సిలర్ చెప్పు చేతలల్లోనే..
అతడే అసభ్యంగా ప్రవర్తించాడని పోలీస్ స్టేషన్ లో మహిళల పిర్యాదు.
రణం: న్యూస్ కోరుట్ల: ఏప్రిల్ 16,జగిత్యాల జిల్లాకోరుట్లపట్టణంలోని సి ప్రభాకర్ గ్రంథాలయం ప్రాంతంలోని గౌతమ్ మోడల్ స్కూల్ వద్ద ఓ ఇంటి నిర్మాణం విషయంలో తరచు అడ్డుపడుతున్నారన్నా నేపథ్యంలో మాజీ కౌన్సిలర్ ఇందూరి సత్యం పై దాడికి పాల్పడిన ఘటన బుధవారం సాయంత్రం మున్సిపల్ కార్యాలయం ఆవరణలో చోటుచేసుకుంది. ఓ ఇంటి నిర్మాణ విషయంలో ఇంటి నిర్మాణం చేపడుతున్న యాజమాన్యులకు మాజీ కౌన్సిలర్ అడ్డుపడుతున్నారు. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం మున్సిపల్ కార్యాలయంలో మాజీ కౌన్సిలర్ తో పాటు ఇంటి నిర్మాణ యాజమాన్యాలు ఎదురుపడగా తన ఇంటికి ఎందుకు అడ్డుపడుతున్నాడని ప్రశ్నించగా వారి పట్ల అసభ్యంగా ప్రవర్తించారని ఆ కౌన్సిలర్ పై దాడి చేశారు. ఈ దాడి జరిగిన నేపథ్యంలో ఇరువురు స్థానిక పోలీస్ స్టేషన్లో తమ పట్ల కౌన్సిలర్ అసభ్యంగా ప్రవర్తించాడని మహిళలు ఫిర్యాదు చేశారు..
గతం లో ఒక కుటుంబానికి సంబంధించిన అన్న దమ్ముల ఇంటి నిర్మాణ వివాదంలో లీగల్ నోటీస్ ల పేరిట అధికారులను సైతం బెదిరించి నిర్మాణాన్ని కూల్చివేయించిన ఘటన సదరు మున్సిపల్ మాజీ కౌన్సిలర్ చెప్పు చేతల్లోనే జరిగిందని ఆరోపణలు ఉన్నాయి.