గురుకులాన్ని సందర్శించిన అంబేద్కర్ సంఘ నాయకులు


రణం: న్యూస్ కోరుట్ల: ఏప్రిల్ 16:
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని కల్లూరు రోడ్ లో గల రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను అంబేద్కర్ సంఘ నాయకులు బుధవారం సందర్శించి పరిశీలించారు. గత రెండు రోజులుగా పాఠశాలలోని పలువురు విద్యార్థులు జ్వరాలతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరుతున్న సందర్భంగా వారు పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ బాబును కలిసి జరిగిన పరిస్థితుల గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ బాబు మాట్లాడుతూ గత రెండు రోజుల క్రితం ఐదుగురు విద్యార్థులకు జ్వరం వచ్చిందని, మరుసటి రోజు మరో అయిదురికి జ్వరం వచ్చినట్లు తెలిపారు. వీరిని ఆసుపత్రికి తీసుకెళ్తే పాఠశాలలో ఉన్న మిగతా విద్యార్థులకు కూడా పరీక్షలు చేశారని అందులో కొంతమందికి జ్వరం ఉన్నట్లు నిర్ధారణ అయితే ఆసుపత్రికి తీసుకువచ్చామన్నారు. ఇది కాస్త వైరల్ కావడంతో కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలలోని అందరు విద్యార్థులు ఆరోగ్యంగా ఉన్నారని ప్రస్తుతం జరుగుతున్న పరీక్షలు రాస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా అంబేద్కర్ సంఘ నాయకులు మాట్లాడుతూ గురుకులాలలో పేద విద్యార్థుల విద్యను అభ్యసిస్తారని విద్యతోపాటు ఆరోగ్యం పై కూడా శ్రద్ధ చూపాలని కోరారు. ఒకరిద్దరికీ ఆరోగ్య సమస్య వచ్చినా వెంటనే ఆసుపత్రిలో చూపించాలని సూచించారు. గురుకుల పాఠశాలలో చదివిన విద్యార్థులు అనేక ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు బలిజ రాజారెడ్డి, ఉయ్యాల నరసయ్య, పొట్ట లక్ష్మణ్, ఉయ్యాల శోభన్, బద్ది మురళీధర్, గురు మంతుల సత్తయ్య, సామల వేణుగోపాల్, బలిజ సంతోష్ కుమార్, అన్నం చిరంజీవి తదితరులు ఉన్నారు.