ప్రజాసంఘాల నేత వేములవాడ బ్రహ్మం ను పరామర్శించిన డాక్టర్ పేట భాస్కర్
రణం: న్యూస్ కోరుట్ల:ఏప్రిల్ 15,తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర కార్యదర్శి వేములవాడ బ్రహ్మం సోదరుడు మేట్పల్లి మనుమయ సంఘం మాజీ అధ్యక్షుడు వేములవాడ భాస్కర్ చారి ఈమధ్యనే అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబాన్ని టిపిఎస్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పేట భాస్కర్ పరామర్శించారు. మంగళవారం మేట్పల్లిలోని వారి స్వగృహంలో భాస్కర్ చారి కుమారులు రాజు, ప్రశాంత్ లను కలిసి మృతికి గల కారణాలు తెలుసుకొని పేట భాస్కర్ వారిని ఓదార్చారు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈకార్యక్రమంలో జేఏసీ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఎలిశేట్టి గంగారెడ్డి, విశ్వబ్రహ్మన సంఘం జిల్లా అధ్యక్షులు లక్కాకుల సద్గురు, రచయిత వేములవాడ జనార్దన్ చారి, లక్ష్మీ నారాయణ, మండే శ్రీదర్, ఈశ్వర్ చారి,గన్నారపు శ్రీనివాస్,సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.

