మహాత్మ జ్యోతిబాపూలే జయంతి వేడుకలు…
జ్యోతిబాపూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన కాంగ్రెస్ నేతలు
కోరుట్ల పట్టణ జువ్వాడి కృష్ణారావు స్వగృహం జువ్వాడి భవన్ లో శుక్రవారం మహాత్మ జ్యోతిబాపూలే జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన కోరుట్ల మండల పట్టణ కాంగ్రెస్ పార్టీ నేతలు ఈసందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ సామాజిక సంస్కర్తల దార్శనికుడు సామాజిక న్యాయ పితామహుడు బలహీన వర్గాల చైతన్య స్పూర్తి దాత మహాత్మా జ్యోతిరావు పూలే సామాజిక సమానత్వం మహిళా సాధికారత విద్యను పెంపొందించడం కోసం అవిశ్రాంతంగా కృషి చేశారన్నారు 19వ శతాబ్దంలో జ్యోతిభాపూలే ప్రారంభించిన అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేయడం అనే మహోన్నత ఆశయాన్ని 20వ శతాబ్దంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సైతం స్ఫూర్తిగా తీసుకొని కొనసాగించారు చట్టపరంగా ఎలాంటి వివక్షత తారతమ్యాలు లేకుండా ప్రజలందరికీ సామాజిక న్యాయం హక్కులు దక్కాలని పూలే జీవితాంతం పరితపించారని సంఘసంస్కర్త సామాజిక తత్వవేత్త ఉద్యమకారుడు మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను కోరుట్ల పట్టణ జువ్వాడి భవన్ లో నిర్వహించడం జరిగిందన్నారు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన దీన జన బాంధవుడు అని మహిళా విద్యాభివృద్ధికి మార్గదర్శి సమసమాజ స్థాపనలో భావితరాలకు నిత్య స్ఫూర్తి ప్రదాతగా నిల్చాడన్నారు సమాజంలో కులపరమైన వివక్షను అన్యాయాలను రూపుమాపడానికి తన జీవితాన్ని ధారపోషణ మహాత్ముడు అని కొనియాడారు ఆయన ఆలోచనలను ఆశలను స్ఫూర్తిగా తీసుకొని యువత ముందుకు సాగాలని కోరారు ఈ కార్యక్రమంలో కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్ మ్యాకల నర్సయ్య ఎంబేరి సత్యనారాయణ జిల్లా మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు సోగ్రాభి ఏ ఆర్ అక్బర్ దశరథం చిట్యాల లక్ష్మినారాయణ నేమూరి భూమయ్య ముల్క ప్రసాద్ సదుల వెంకటస్వామి అల్లం రాజమౌళి శేఖర్ యూట్యూబర్ రాజు కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
