జ్యోతిభా పూలే యువతకు స్ఫూర్తి…
Mallikarjun Ranam April 11, 2025
బి సి యువజన సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి శికారి గోపికృష్ణ
రణం: న్యూస్ కోరుట్ల:ఏప్రిల్ 11,సామాజిక తత్వవేత్త మహత్మ జ్యోతిభా పూలే ఆశయాల సాధనకై నేటి యువత ఉద్యమించాలని బి సి యువజన సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి శికారి గోపికృష్ణ పట్టణంలోని రామకృష్ణ డిగ్రీ పి జీ కళాశాలలో జయంతి ఉత్సవాలను ఉద్దేశించి పిలుపు నిచ్చారు. శుక్రవారం పూలే జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఈ కార్యక్రమం ను ఉద్దేశించి వారు మాట్లాడుతూ విద్యా వికాసం వర్థిల్లాలని, సాంఘీక దురాచారాలకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేశారని,ఆడ పిల్లల విద్యాభ్యాసం కోసం సావిత్రి భాయి పూలేను ఈ దేశానికి మొట్ట మొదటి మహిళా ఉపాధ్యా యురాలుగా అందించిన మహోన్నత మూర్తి పూలే అని గుర్తు చేశారు పట్టణములో పూలే పుణ్య దంపతుల విగ్రహ ఏర్పాటుకై ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో బి సి యువజన సంఘం సంయుక్త కార్యదర్శి తుమ్మనపెల్లి రాజేంద్రప్రసాద్ రామకృష్ణ డిగ్రీ,పి జీ సంయుక్త కళాశాలల ప్రిన్సిపాల్ బిజ్జారవు ప్రవీణ్ కుమార్ రాజు రాజ్ కుమార్ నవీన్ సాయిరాం నాగభూషణ్ నరేందర్ మహేష్ శ్రీనివాస్ గణేష్ గంగా లక్ష్మి భార్గవి ఆసిమా రాజమణి సుప్రియ తదితరులు పాల్గొన్నారు
