5 ప్రాంతాల్లో ఏసీబి సోదాలు – పెద్ద మొత్తంలో బయటపడ్డ ఆస్తులు
రణం న్యూస్, జగిత్యాల:: ఫిబ్రవరి 8,

హన్మకొండ డీటీసీ పుప్పాల శ్రీనివాస్ ఆధాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడనీ ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసినట్లు తెలిసింది.
వరంగల్, జగిత్యాల, కరీంనగర్ తో పాటు 5 ప్రాంతాల్లో ఏకకాలంలో శ్రీనివాస్ ఇళ్ళు, బంధువుల ఇళ్లలో ఏసీబీ అధికారులు రెండు రోజుల క్రితం సోదాలు చేసి నిర్వహించి పలు కీలక డాక్యుమెంట్లు స్వాదినం చేసుకున్నట్లు సమాచారం.
ఏసీబీ తనిఖీల్లో పలు ఓపెన్ ప్లాట్లు, వ్యవసాయ భూములు గుర్తించిన్నట్లు,
అలాగే
₹ 2.79 కోట్ల విలువైన 3 ఇళ్లు, ₹13.57 లక్షల విలువైన 16 ఓపెన్ ప్లాట్లను అధికారులు గుర్తించారాని తెలిసింది.
₹ 14 లక్షల విలువైన 15.20 ఎకరాల వ్యవసాయ భూమి ఏసీబి సోదాల్లో బయపడ్డాయి.
కిలోన్నర బంగారం, 400 గ్రాముల వెండి, రూ. 5 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నట్లు గుర్తించారు.
₹ 22.85 లక్షల కార్లు, బైక్ లను ఏసీబి అధికారులు స్వాధీనం చేసుకున్నారని తెలిసింది.
అయితే హన్మకొండ డీటీసి గా విధులు నిర్వహిస్తున్న పుప్పాల శ్రీనివాస్ స్వగ్రామం జగిత్యాల కాగా ఇక్కడ సైతం అధికారులు సోదాలు నిర్వహించారు.
