కోరుట్ల లో ఒక్క మిల్లర్ సుమారు 70 కోట్ల విలువైన ధాన్యం లూటీ
విజిలెన్స్ అధికారులు.. వచ్చారట… వెళ్లారట…..మరి ఏం చేశారు
ఈ సీక్రెట్ తనికీలో ఆంతర్యమేంటో…
కోట్ల రూపాయల ధాన్యం కొల్లగొట్టిన కోరుట్ల రైస్ మిల్ యజమాని
మిల్లు ఒక్కటే..ట్రేడ్ మార్క్ లైసెన్సులు మూడు నాలుగు
ఈ బడా మిల్లర్ అంటే అధికారులకు ఎందుకో ఎనలేని ప్రేమ…
రణం న్యూస్ కోరుట్ల: నవంబర్ 5,
జగిత్యాల జిల్లాతో రాష్ట్రం లోచాలా జిల్లాల్లో కొందరు బడా వ్యాపారులు అక్రమాల కోసమే కొత్తగా రైస్ మిల్లులను ఏర్పాటు చేస్తున్నట్లు ఆరోపణలుస్పష్టమైతున్నాయి. పెద్ద ఎత్తున ధాన్యాన్ని పక్కదారి పట్టించిన కోరుట్లలో రైస్ మిల్లులపై కేసులు నమోదు చేశారు.కానీ 60 నుండి 70 కోట్ల రూపాయల విలువైన ధాన్యాన్ని పక్కదారి దారి పట్టించి భూములు ఇతర ప్రాపార్టీలు కొంటూ, కోరుట్ల మెటపల్లి డివిజన్ లలో మిల్లుల మీద మిల్లులు ఏర్పాటు చేస్తున్న ఒక బడా మిల్లర్ కు మాత్రం ఎలాంటి చర్యలు చేపట్టకుండా ధాన్యాన్ని కేటాయిస్తున్నారు. ఇటీవల ఈ మిల్లర్ నాలుగైదు రైస్ మిల్లులు ఏర్పాటు చేసుకుని,పెద్ద పెద్ద ఫార్మ్ హౌస్ లు,ఫంక్షన్ హాల్ లు నిర్మించుకోవడం ప్రభుత్వ బకాయిలు మాత్రం చెల్లించకపోవడం గమనించదగ్గ విషయమే. సీఎంఆర్ ధాన్యం కేటాయింపులో గల లొసుగులపై పూర్తిస్థాయిలో అవగాహన ఉన్న సదరు మిల్లర్ ధాన్యం డబ్బులను దండుకునేందుకే కొత్తగా ఈ మిల్లులను ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు. మిల్లులను ఏర్పాటు చేసి ఏడాది కూడా పూర్తి కాకముందే పెద్ద ఎత్తున ధాన్యాన్ని తరలించడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. గడిచిన సీజన్ లలో దాదాపు రెండు నుంచి మూడు కోట్లు పెట్టుబడి పెట్టి మిల్లులను ఏర్పాటు చేస్తున్న వ్యాపారులు.. సీఎంఆర్ ధాన్యాన్ని తీసుకుని బియ్యాన్ని ఇవ్వకుండా ప్రభుత్వానికి కోట్ల రూపాయలకు ఎగనామం పెడుతున్నారు.

అధికారులు మిల్లర్లు కుమ్మక్కు.. ఒక మిల్లు సీజ్ చేస్తే ఇంకో మిల్లు ఏర్పాటు….
అధికారులు సదరు మిల్లును సీజ్ చేసినా దాని యజమానులు పెద్దగా పట్టించుకోవడం లేదు. మిల్లు విలువ కంటే తరలించిన ధాన్యం విలువ పదింతలు ఉండడంతో ఈ అక్రమ దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతున్నది. నాలుగేళ్లుగా జిల్లాలోని కొంతమంది మిల్లర్లు పెద్ద ఎత్తున అవకతవకలకు పాల్పడుతున్నప్పటికీ వారిపై నామమాత్రపు చర్యలే తప్ప కఠిన చర్యలు లేకపోవడంతో అక్రమాలకు మరింత ఆస్కారమిస్తున్నదని చెబుతున్నారు. ఇటీవల సీఎంఆర్ విషయంలో అవకతవకలకు పాల్పడిన కొన్ని రైస్‌మిల్లులపై కేసులు నమోదు చేసినప్పటికీ పరిస్థితుల్లో మార్పు కనిపించడం లేదు.
పుట్టగొడుగుల్లా రైస్ మిల్లులు… నిబంధనలకు తిలోదకాలు…
జిల్లాలో కొత్తగా రోజుకో రైస్‌మిల్ పుట్టుకొస్తూనే ఉన్నది. వాస్తవానికి ప్రతి సీజన్లో రైస్ మిల్లులకు సీఎంఆర్ ధాన్యం కేటాయించేటప్పుడు 10 శాతం బ్యాంకు గ్యారెంటీ తీసుకోవాలనే నిబంధన ఉన్నది. సంబంధిత అధికారులు అవేమి పట్టించుకోకుండా కొత్తగా ఏర్పాటు చేసిన మిల్లులకు ధాన్యాన్ని కేటాయించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది అధికారులు మిల్లర్లతో కుమ్మక్కుకావడం వల్లనే వారు యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మిల్లు ఒక్కటే …మూడు ట్రేడ్ మార్క్ లైసెన్సులు
ఈ దందాలో ఆరితేరిన మిల్లర్ లాజికల్ గా కూడా మోసాలకు తెరలేపుతున్నారు.ఒక్కమిల్లు ట్రేడ్ లైసెన్ లు మూడు నాలుగు తీసుకుని ఇతనికి సంబంధించినవే నాలుగైదు రైస్ మిల్లులుంటే పదిహేను నుండి 20 ట్రేడ్ మార్క్ లు ఉన్నాయి.ఆ ట్రేడ్ లైసెన్సు లపై లోడ్ లకు లోడ్ లు సీఎంఆర్ టన్నులకొద్ది తీసుకుని పక్కదారి పట్టించడం వీరికి వత్తాసు పలికే అధికారగణం జేబులునింపటం పరిపాటే.

విజిలెన్స్ అధికారులు… వచ్చారట… వెళ్లారట..
కోట్ల రూపాయల ధాన్యం కొల్లగొట్టారంటూ ఆరోపణలున్న ఒక మిల్లర్ మాఫియాకు గతంలో జిల్లా నాయకుడు గా పనిచేసిన నాయకుడి కి చెందిన కథలపూర్ మండలం సిరికొండ గ్రామంలోని మిల్లులపై కోరుట్ల లో రైస్ మిల్లు ల పై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సీక్రెట్ గా దాడులు నిర్వహించడానికి గల కారణాలు తెలియరావడం లేదు. కోట్ల రూపాయల విలువైన ధాన్యం పందికొక్కులా మెక్కిన యజమాని కుమ్మక్కు అయ్యారని వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.మిల్లర్లకు అధికారులకు మధ్యవర్తులు గా తాజాగా మిల్లర్లు గా అవతారమెత్తిన చోటా మోటా ఖద్దరు వ్యాపారస్తులు వ్యవహరిస్తున్నట్లు చర్చిస్తున్నారు.ఐదారు వాహనాల్లో వచ్చి గుట్టు చప్పుడు కాకుండా తనికీలు చేసి జిల్లా అధికారికి కూడా తనికీకి సంబంధించి రిపోర్ట్ ఇవ్వలేదని అనడం..ఈ బియ్యం బుక్కిన దొంగల్లో అందరూ పాత్రదారులేనా అనే అనుమానాలు నిజమే అనే అవకాశాలు కూడా బలపడుతున్నాయి.
