జిల్లా ఉప వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎన్. శ్రీనివాస్



రణం న్యూస్ కోరుట్ల,జూన్ 13: ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని, సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఉప వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎన్ శ్రీనివాస్ అన్నారు.. శుక్రవారం వైద్యశాఖ ఆధ్వర్యంలో
స్థానిక మున్సిపల్ అవరణ లో 100 రోజుల కార్యక్రమంలో భాగంగా
పురపాలక శాఖలో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ కార్మికులకు,ఎస్ హెచ్ జీ,మహిళలకు అధికారులకు ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిలుగా
జిల్లా ఉప వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎన్. శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ హాజరై ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు.. ఈ సందర్భంగా వైద్యాధికారులు సుమారు 150 మందిని రక్త పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అనంతరం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఎన్. శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రస్తుతం సమాజంలో చాలామంది బిజీ అయిపోయి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపడం లేదన్నారు.. ఫలితంగా తక్కువ వయసులోనే బీపీ, షుగర్, థైరాయిడ్, గుండే, కాలేయం తదితర సంబంధించిన వంటి వ్యాధుల బారిన పడుతున్నారన్నారు. నిత్యం వ్యాయామం చేయడం ద్వారా ఆరోగ్యంగా జీవించవచ్చునని చెప్పారు. సమతుల్య ఆహారం తీసుకోవాలని సూచించారు. ఆరోగ్య నియమాలను ప్రతి ఒక్కరూ పాటించాలని కోరారు.. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.అనంతరం మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ మాట్లాడుతూ వైద్య ఆరోగ్యశాఖ ద్వారా నిర్వహించి వైద్య శిబిరాలను కార్మికులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, తమ ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. చేడూ అలవాట్లను మానివేయాలని, పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవాలని సూచించారు.పట్టణ పారిశుద్ధ్యంలో పారిశుద్ధ కార్మికులు చేసే సేవలు మరువలేనివని, వీరు పారిశుధ్య విధులు నిర్వహిస్తూ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచి ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండడంలో ప్రముఖ పాత్ర వహిస్తున్నారన్నారు. కావున ప్రతి ఒక్కరూ వారి సేవలను గుర్తించి వారిని గౌరవించాలని సూచించారు..మున్సిపల్ శాఖ కార్మికుల కోసం వైద్య శిబిరం ఏర్పాటు చేసిన వైద్య సిబ్బందికి కమీషనర్ కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు డాక్టర్ సమీని, డాక్టర్ శృతిలయ, డాక్టర్ అనిల్, సూపర్వైజర్లు ధనుంజయ, భూషణ్, లక్ష్మీనారాయణ, కౌన్సిలర్ మల్లికార్జున్, ల్యాబ్ టెక్నీషియన్లు సాజిద్ అలీ,రాము,రియాజ్, ఎస్ టి ఎస్ ఇమ్రాన్, హరీష్, సంతోష్, రమ్య, శంకర్, నాగరాజు, ఏఎన్ఎం లు, ఆశా కార్యకర్తలు, మున్సిపల్ మేనేజర్ శ్రీనివాస్, సానిటరీ ఇన్స్పెక్టర్ రాజేంద్ర ప్రసాద్, సిబ్బంది అశోక్, మెప్మా సిబ్బంది, పారిశుద్ధ కార్మికులు పాల్గొన్నారు.