వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
రణం న్యూస్ ,మేడిపల్లి మండలం, జూన్ 19:

వేములవాడ నియోజకవర్గంలోని ఉమ్మడి మేడిపల్లి మండలానికి సంబంధించి సమస్య ఏదైనా తన దృష్టికి వచ్చిన వెంటనే పరిష్కరించే మార్గం చూస్తానని వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. గురువారం రోజున మేడిపల్లి మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని సభను ఉద్దేశించి మాట్లాడారు .ఈ సందర్భంగా వేములవాడ నియోజకవర్గంలోని ఉమ్మడి మేడిపల్లి మండలానికి సంబంధించిన ఏ సమస్య అయినా అతని దృష్టికి వచ్చిన దాన్ని పరిష్కరించానని గత ప్రభుత్వ హయాంలో జరగని పనులను తాను ఎమ్మెల్యేగా గెలుపొందాక సమస్యల పరిష్కారం చేస్తున్నానని గతంలోనే ఉమ్మడి మేడిపల్లి మండలంలో నూతన సబ్ స్టేషన్, 30 పడక గదుల ఏరియా ఆస్పత్రి కొరకు భీమారం మండల కేంద్రంలో శంకుస్థాపన చేశామని, మేడిపల్లి మండల కేంద్రానికి ప్రభుత్వ జూనియర్ కళాశాల మంజూరు చేసామని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కార్యకర్తలు, వివిధ గ్రామాల ప్రజలు, విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.