
జిల్లా లో అనుముతులు లేని పాఠశాలలు కోకొల్లలు
జిల్లా విద్యాఅధికారి,మండల విద్యాధికారులు స్పందించాలని పలు ఫిర్యాదులు..
పిర్యాదలన్ని బుట్టదాఖలే అని ఆరోపణలు
రణం న్యూస్ జగిత్యాల,ఆగస్ట్ 4
అనుమతి లేకుండా నడుస్తున్న జగిత్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ చైతన్య పాఠశాల సీజ్ చేసి విద్యార్థులను పంపించివేసిన ఎంఈవో..జగిత్యాలలోని నూర్ మజీద్ పక్కన అనుమతులు లేకుండా నడుస్తున్న…శ్రీ చైతన్య పాఠశాలను అఖిల భారత విద్యార్థి సమైక్య నాయకుల ఫిర్యాదుతో…జగిత్యాల అర్బన్ ఎంఈఓ చంద్రకళ వారి సిబ్బందితో కలిసి వచ్చి సీజ్ చేసి పిల్లలను పంపించారు
విద్యా వ్యాపారాన్ని కట్టడి చేయాల్సిన అధికారులే భాగస్వాములు:-
జిల్లాలో ప్రతి మండలంలో అనుమతులు లేకుండా నడుస్తున్న పాఠశాలలపై మండల విద్యాధికారులు స్పందిస్తే బాగుంటుందని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. అనుమతులు లేని పాఠశాలాల పై ఎన్ని ఫిర్యాదులు చేసిన బిత్త దాఖలు అవుతున్నాయని, జిల్లాలో తొంబదిశాతం పాఠశాలలు నిబంధనలు పాటించ కుండా నిర్వహిస్తున్నారని విద్యార్థి సంఘాల నాయకులు దుయ్యబట్టారు. అందరూ అధికారులు తాయిలాలకు ఆశపడకుండా తనికీలు చేస్తే చాలా వరకు కట్టడిచేయవచ్చు అని విద్యార్టీ నాయకులు అంటున్నారు. విద్యా వ్యాపారానికి అధికారులు కూడా సహకారం అందిస్తున్నారని ఆరోపణలు విమర్శలు ఉన్నాయి..
