
బుద్ధ అవార్డ్ గ్రహీత బీసీ బిడ్డకు మున్నూరు కాపు సంఘం సత్కారం
రణం న్యూస్ కోరుట్ల మే9
జాతీయ బుద్ద అవార్డు గ్రహీత బీసీ బిడ్డ శ్రీ గద్దె నరహరి జిల్లా మున్నూరు కాపు సంఘం తరుపున నాయకులు ఘనం గా సత్కరించారు. మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షులు చెదలు సత్యనారాయణ మాట్లాడుతూ సామాజిక సేవలో ముందుంటు జాతీయ పార్టీ సేవాదల్ అధ్యక్షుడుగా సేవలు అందిస్తున్న నరహరి ఇంకా అనేక సేవాకార్యక్రమాలు చేయాలని బడుగు బలహీనవర్గాలుకు చేదోడు వాదోడు గా ఉండాలని అన్నారు ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లారెడ్డి , ఉపాధ్యక్షులు పుప్పాల రాజేష్ , తిరుపతి సంయుక్త కార్యదర్శి గంగాధర్ , రైతు అధ్యక్షుడు గంగారెడ్డి ప్రముఖ వ్యాపార వేత్త కోలగానీ శ్రీనివాస్ పాల్గొన్నారు