రణం న్యూస్ ,జగిత్యాల: జనవరి 4, జగిత్యాల జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం లో మంగళవారం జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ మరియు
జిల్లా వైద్యాధికారి డాక్టర్ కే ప్రమోద్ కుమార్ ఆధ్వర్యంలో చైల్డ్ డెత్ రివ్యూ పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇప్పటివరకు జరిగిన 78 మరణాలలో 14 మంది చిన్నపిల్లల మరణాలపై డెత్ ఆడిట్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ మాట్లాడుతూ చిన్నపిల్లల మరణాలు సంభవించకుండా తప్పించే మార్గాలను అన్వేషించాలని వైద్యాధికారులకు సూచించారు. ట్రాన్స్పోర్టేషన్ సౌకర్యము మెరుగుపరచాలని, వైద్య అధికారులు అందుబాటులో ఉండాలని, స్కానింగ్ సెంటర్లలో టిప్పా స్కానింగ్ ,2 డి ఎకో మొదలగునవి చేయించవలెనని సూచించారు.జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు సమీక్ష సమావేశంలో పాల్గొని మరణాల నివేదికలను సమర్పించారు. ప్రతి ఒక కేసును క్షుణ్ణంగా విచారించి పలు సూచనలు చేశారు. ఎక్కువగా ప్రీ టర్మ్ బేబీస్, కన్జెంటల్ హార్ట్ డిసీజెస్ మరియు ఆస్పిరేషన్ కేసులు ఉన్నాయి. ముఖ్యంగా నివారించ తగిన మరణాలపై పలు సూచనలు చేశారు. తల్లులు తమ పిల్లలకు పాలు ఇచ్చిన తర్వాత భుజం మీద వేసుకొని బర్ఫింగ్ చేయవలెనని , నెమ్మదిగా వెన్నుపై తట్టవలనని, త్రేన్పులు వచ్చిన తర్వాత మాత్రమే పిల్లలని పడుకోబెట్టవలెనని పసిపిల్లలకు స్నానం చేయించేటప్పుడు చాలా జాగ్రత్తగా నోట్లోకి నీరు పోకుండా చూడవలెనని తెలిపారు . ప్రతి మహిళా ఆరోగ్య కార్యకర్త మరియు ఆశ కార్యకర్త గృహ సందర్శన సమయంలో డెలివరీ అయిన బాలింతలకు కచ్చితంగా కౌన్సిలింగ్ చేయవలెనని ఆదేశించారు. ఇలా చేయడం వల్ల చాలా మటుకు ఆస్పిరేషన్ మరణాలను నివారించవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో చైల్డ్ డెత్ రివ్యూ కమిటీ మెంబర్స్ ప్రోగ్రాం ఆఫీసర్ చైల్డ్ హెల్త్ ఇమ్యునైజేషన్ డాక్టర్ ఏ శ్రీనివాస్, మాతా శిశు సంరక్షణ అధికారి డాక్టర్ జైపాల్ రెడ్డి, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సూపరిండెంట్ డాక్టర్ సుమన్ మోహన్ రావు ,పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ పూర్ణచందర్, గైనకాలజిస్ట్ డాక్టర్ హరిత పవన్, మత్తు వైద్య నిపుణులు డాక్టర్ సుధీర్ , జిల్లా సంక్షేమ అధికారి డాక్టర్ బోనగిరి నరేష్ మరియు వైద్యాధికారులు, హెల్త్ ఎడ్యుకేటర్స్ కటుకం భూమేశ్వర్ ,తరాల శంకర్, హెచ్ ఇ ఓ రాజేషం ఆరోగ్య పర్యవేక్షకులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

