చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీస్
రణం న్యూస్ కోరుట్ల జులై 6, చిన్నారి హితిక్ష హత్య అమానుష అమానవీయ ఘటన పట్టణ ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతి కి గురిచేసింది. పాప తల్లిదండ్రుల బంధువుల రోదనలు మిన్నంటాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. చిన్నారిని పాశవికంగా హత్యచేసిన మానవ మృగం ఎవరు,హత్యకు గల కారణాలు ఏంటి అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టి, డాగ్ స్కాడ్ , ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేశారు. హత్యకు గల కారణాలు వెలికి తీసి విచారణ జరిపి నిందితులను గుర్తించారు. ఇలాంటి అమానుష ఘటనలు హత్యలు పట్టణంలో తరుచూ జరుగుతుండటం ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఇదే తరహాలో పోలీస్ శాఖ చిక్కుముడులు వీడని కేసులను విచారణ చేసి త్వరితగతిన పరిష్కారం చేస్తారనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు