
వేములవాడ నియోజకవర్గానికి మరో గిటు రాయి..
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్..
హర్షవ్యక్తం చేస్తున్న విద్యార్థులు తల్లిదండ్రులు
రణం న్యూస్ వేములవాడ,మే27
రాష్ట్రంలోని పేద, బడుగు,బలహీన, సామన్య, మధ్యతరగతి పిల్లలకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందించడానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను నిర్మాణం చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. వేములవాడ నియోజకవర్గానికి 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తూ విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణ ఉత్తర్వులు జారీ చేశారు.. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లడుతూప్రభుత్వం నిర్మాణం చేస్తున్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల మాదిరిగా దేశంలో ప్రైవేటు విద్యా సంస్థలు కూడా ఉండవన్నారు.