
రణం న్యూస్ కోరుట్ల: ఆగస్టు31
కోరుట్ల పట్టణంలోని రథాలపంపు ఎల్ఐసి కాలనీలో గల” విశ్వక్ సేన ఫ్రెండ్స్ యూత్” ఆధ్వర్యంలో గత పది సంవత్సరాల నుండి పర్యావరణానికి పరిరక్షణగా మట్టి గణపతిని ప్రతిష్టిస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం రోజు విశ్వక్ సేన ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో మహా అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కోరుట్ల పట్టణంలోని ప్రముఖ వైద్యులు, జర్నలిస్టులు, ప్రభుత్వ అధికారులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శించుకున్నారు. అనంతరం మహా అన్నప్రసాద కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశ్వక్ సేన ఫ్రెండ్స్ యూత్ సభ్యులు మాట్లాడుతూ… సర్వ విఘ్నాల అధిపతి విఘ్నేశ్వరుని అనుగ్రహం ప్రతి ఒక్కరికీ ఉండాలని ఆకాంక్షించారు. గత 10 సంవత్సరాల నుండి శ్రీ గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. శ్రీ గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు నిర్వహించే పూజా కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామి వారి ఆశీస్సులు పొందాలని యూత్ సభ్యులు పేర్కొన్నారు. మహా అన్నప్రసాద కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.. ఇట్టి కార్యక్రమంలోకటకం రవితేజ శికారిసుబ్బు చిప్పవికాస్ పెండం వంశీ కుదేలరక్షిత్ హనుమండ్ల మనోజ్ గుర్రాల కౌశిక్ మచ్చ హేమంత్ జయంత్ రెడ్డి గాండ్ల వరుణ్ కొక్కుల సుమిత్ గౌతం తదితరులు పాల్గొన్నారు


