నిజామాబాద్ చైర్ పర్సన్ ఎరుకల నారాయణ
రణం న్యూస్ :మెట్ పల్లి, జూన్ 11: అపరిష్కృతంగా మిగిలిపోయిన విద్యుత్ సంబంధిత సమస్యలు తక్షణమే పరిష్కరించడానికి లోకల్ కోర్టులు నిర్వహిస్తున్నామని, అందుకు విద్యుత్ అధికారులు, సిబ్బంది మెరుగైన సేవలు అందించాలని సీజీఆర్ఎఫ్-2, నిజామాబాద్ చైర్ పర్సన్ ఎరుకల నారాయణ పిలుపునిచ్చారు. బుధవారం మెట్ పల్లి లో విద్యుత్ వినియోగదారుల సమస్యలకు సంబంధించి ఏర్పాటు చేసిన పరిష్కార వేదిక-లోకల్ కోర్టు ఫోరమ్ చైర్ పర్సన్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో అధికారులు వినియోగారుల సమస్యను లోతుగా పరిశీలించి వెనువెంటనే పరిష్కరించి న్యాయం చేయాలని, ఉపేక్షిస్తే, అలసత్వం ప్రదర్శించిన ఉద్యోగులపై కఠినమైన చర్యలుంటాయన్నారు.
వినియోగదారుల పట్ల జవాబుదారీ తనంతో ఉండాలని, అన్ని విధ్యుత్ కార్యాలయాల ముందర పౌర సేవా పత్రం అతికించాలని, ఇంజనీర్లు, సిబ్బంది చరవాణి నంబర్లను గోడలపై రాయించాలని ఆదేశించారు.
రైతులు, వినియోగారులు విద్యుత్ ఆదా కొరకు తమ వ్యవసాయ పంపుసెట్లకు కెపాసిటర్లు బిగించుకోవాలని, ప్రమాదాలపట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లోకల్ కోర్టు లో ఒక్క పిర్యాదు కూడా నమోదు కాలేదని, భవిష్యత్తులో సిజిఆర్ఎఫ్ లోకల్ కోర్టు ల గురించి వినియోగదారుల్లో విస్తృత ప్రచారం కల్పించాలన్నారు.
ఈ కార్యక్రమంలో సిజిఆర్ఎఫ్ మెంబర్ టెక్నికల్ రామకృష్ణ, మెంబర్ ఫైనాన్స్ కిషన్, జగిత్యాల ఎస్ఈ షాలియా నాయక్, మెటుపల్లి డిఈ గంగారాం, ఏడీఈ లు మనోహర్, రఘుపతి, ఏఈలు రవి, ప్రదీప్, శివకుమార్, శ్రీనివాస్, అజయ్, మెటుపల్లి సబ్ డివిజన్ లోని మూడు సెక్షన్ల వినియోగదారులు, రైతులు హాజరైనారు.

