జిల్లా ఎన్పీడీసిఎల్ ఎస్ఇ సుదర్శనం

రణం న్యూస్ మెట్ పల్లి, జూలై 30: వినియోగదారులకు, రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించడం, పారదర్శక, వేగవంతమైన సేవలు కొనసాగించడం విద్యుత్ సంస్థ అత్యంత ప్రాధాన్యత స్తుందని
జగిత్యాల జిల్లా ఎన్పీడీసిఎల్ ఎస్ఇ సుదర్శనం పేర్కొన్నారు.
మెట్లచిట్టాపూర్ సబ్స్టేషన్ లో రూ.85 లక్షలతో ఏర్పాటు చేసిన అదనపు 5 ఎంవిఏ పవర్ ట్రాన్స్ఫార్మర్ బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్ఇ సుదర్శనం మాట్లాడుతూ అన్ని సబ్స్టేషన్ లకు రెండవ ప్రత్యామ్నాయ 33కేవీ అంతర్గత లైన్లు నిర్మాణం చేస్తున్నామని అందులో దాదాపు 70 శాతం పూర్తి చేశామని తెలిపారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో సైతం అత్యంత తక్కువ సమయంలో రెండవ లైన్ నుండి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని తెలిపారు. రైతులు మోటార్ పంపుసెట్లకు కెపాసిటర్ లు బిగించుకొని ఓవర్ లోడ్, లో ఓల్టేజ్ సమస్య అధిగమించవచ్చని తెలిపారు. ట్రాన్స్ఫార్మర్లు కాలిపోకుండా రక్షించుకోవచ్చని, అందుకు రైతులు సహకారం అందించాలని కోరారు.
వినాయక విగ్రహాల శోభాయాత్ర మార్గంలో అధికారులు ముందస్తుగా సర్వే నిర్వహించి ఎత్తు తక్కువగా ఉన్న లైన్ లను గుర్తించి కొత్త స్తంభాలు అమర్చి, ప్రమాదాల నివారించాలని సూచించారు.
మెట్ల చిట్టాపూర్ లో వనమహోత్సవం సందర్భంగా సబ్స్టేషన్ ఆవరణలో ఎస్ఇ సుదర్శనం ఆధ్వర్యంలో సుమారు 25 మొక్కలు నాటారు. మిగతా అన్ని సబ్స్టేషన్ లలో కనీసం 45 చొప్పున మొక్కలు నాటాలని అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. లైన్ల కు అడ్డంగా ఉన్న చెట్ల కొమ్మలు మాత్రమే తొలగించాలని, కానీ చెట్టుకు నష్టం కల్గించినట్లయితే కఠిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మెటుపల్లి డిఇ మధుసూదన్, డీఈ ఎమ్మార్టీ గోపికృష్ణ, డీఈ టెక్నికల్ గంగారాం, ఏడీఈ లు మనోహర్, రాజు, ఏఈ లు అజయ్, రహీం, ప్రజా ప్రతినిధులు శేఖర్ రెడ్డి, ఆకుల రాజరెడ్డి, గ్రామ కార్యదర్శి దివ్య, విద్యుత్, ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు.