
రణం న్యూస్ కోరుట్ల, సెప్టెంబర్ 19:
మెట్రో పాలిటన్ సిటీ క్రిమినల్ కోర్టులో, నాగర్ కర్నూలు కోర్టు ఆవరణలో న్యాయవాదులపై దాడిని నిరసిస్తూ శుక్రవారం కోరుట్ల బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు విధులను బహిష్కరించారు. చట్టానికి,కోర్టుకు, కక్షీదారులకు న్యాయవాది వారధిగా విధులు నిర్వహిస్తుంటారని, అలాంటి న్యాయవాదులపైన భౌతిక దాడికి పాల్పడటం అనేది చట్ట రిత్యా నేరమన్నారు. భవిష్యత్ లో ఇలాంటి భౌతిక దాడులకు పాల్పడితే కఠినంగా వ్యవహరి స్తామని హెచ్చరించారు . కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ చట్టం అమలు లోనికి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కొంపల్లి సురేష్, ఉపాధ్యకులు కస్తూరి రమేష్, సీనియర్ ఈసి సభ్యులు కడకుంట్ల సదాశివ రాజు, గోనె సదానంద నేత, తన్నీరు శ్రీనివాస్ రావు, శ్రీనివాస్, రాజశేఖర్, సుతారి నవీన్, వివేక్, ఉమ, అనిల్, రాము, న్యాయవాదులు పాల్గొన్నారు.

