జగిత్యాల జిల్లా ఇంటర్మీడియట్ విద్యా అధికారి బొప్పరాతి నారాయణ..


రణం న్యూస్ జగిత్యాల, జులై 4,
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచాలని జగిత్యాల జిల్లా ఇంటర్మీడియట్ విద్య అధికారి బొప్పరాతి నారాయణ అన్నారు.. శుక్రవారం మల్యాల మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించి తరగతి గదులను పరిశీలించారు.. అనంతరం విద్యార్థులతో సమావేశమయ్యారు.. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ విద్యార్థులు తరగతులకు రెగ్యులర్ గా హాజరు కావాలన్నారు.. విద్యార్థులు డ్రగ్స్, గంజాయి లాంటి మత్తుమందు పదార్థాలకు దూరంగా ఉండాలని, లేనిచో భవిష్యత్తు అంధకారమవుతుందన్నారు.. మత్తు పదార్థాలు వాడటం వల్ల నేర ప్రవృత్తి పెరుగుతుందన్నారు.. త్వరలోనే అన్ని జూనియర్ కళాశాలల్లోని తరగతి గదుల్లో సీసీ కెమెరాలు అమర్చడం జరుగుతుందన్నారు.. విద్యాబోధనలో నాణ్యత కోసం ప్రతి తరగతి గదిలో సీసీ కెమెరాలు అమర్చడం జరుగుతుందన్నారు.. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ప్రిన్సిపాల్ జి. శ్రీవాణి అధ్యాపకులు అత్తినేని శ్రీనివాస్, యముల శ్రీనివాస్, మహమ్మద్ నవాబ్, వేనపెల్లి సంధ్య, పురాణం శ్రీధర్, బాసని నరేష్, దమ్మయ్య గారి శ్రీకాంత్, గగడం రచన, కేశవేణి శ్రీనివాస్, నగునూరి పూర్ణిమ, కడారి అనూష, లైబ్రేరియన్ ఆవారి సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు..