
రణం: న్యూస్ కోరుట్ల: ఏప్రిల్8:కోరుట్ల మండలం యూసుఫ్ నగర్ గ్రామంలో ఎమ్మెల్యే డా.కల్వకుంట్ల సంజయ్ వినూత్న కార్యక్రమానికి స్వీకారం చుట్టారు. ఏప్రిల్ 27న వరంగల్ లో నిర్వహించనున్న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని స్వయంగా ఎమ్మెల్యే సంజయ్ గోడపై వాల్ రైటింగ్ రాశారు..పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకను పురస్కరించుకొని ఈ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సభను పార్టీ అభిమానులు,నాయకులు విజయవంతం చేయాలని కోరారు..