ఎవరా…..నిరుద్యోగి…...
సర్పంచ్ బరిలో మూడు పిజి లు…. బీఈడీ చదివిన నిరుద్యోగి
తన పేరు చివర నిరుద్యోగి
రణం న్యూస్ డెస్క్:: డిసెంబర్ 8
(ఆకుల మల్లికార్జున్..ఎడిటర్)
తన పేరు చివర ఎవరైనా ఇంటి పేరును కొన్ని ప్రాంతాల్లో తండ్రి పేరును పెట్టుకుంటారు ఇక్కడ చూస్తే తన పేరు చివర నిరుద్యోగి తన విజిటింగ్ కార్డ్ లో నిరుద్యోగి అని తన ఇంటిపేరునే మరిచిపోయేలా ఒక ఉన్నత చదువుల నిరుద్యోగి కథనం మన “రణం” దినపత్రికలో స్పెషల్ స్టోరీ…

నేటి కాలంలో ఎవరిని చూసినా…నేను ఈ ఉద్యోగం చేస్తున్నాను… ఆ ఉద్యోగం చేస్తున్నాను ..వ్యాపారం చేస్తున్నాను …. విదేశాల్లో జాబ్ చేస్తున్నాను అన్ని చేప్పుకొస్తుంటే నేను ఒక నిరుద్యోగి… నేను మూడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ లు ఎమ్ ఎ సోషియాలజి,ఎమ్ ఎ ఇంగ్లీష్,ఎమ్ ఎ జర్నలిజం , బీఈడీ చేశాను…ఇపుడు ఇంకో పిజి చేస్తున్నాను… బీఈడీ కూడా చేశాను… గ్రూప్స్ వ్రాశాను అందులో అర్హత సాధించాను… గత ప్రభుత్వం పేపర్ లీకేజీ లతో ఆ రిజల్ట్ ను ఆపివేశారు….అర్హతకు మించి చదువుకున్న నేను గర్వంగా చెప్పుకంటాను.. కాలర్ ఎగరేసి నేను చెప్తాను… తన నడిపే మోటార్ సైకిల్ కు కూడా నిరుద్యోగి స్టిక్కర్ తగిలించుకుని అందరిని ఆకట్టుకునుటన్నాడు….ఈ నిరుద్యోగి..ఇంతకీ ఆ నిరుద్యోగి ఎవరు అనుకుంటున్నారా.

వివరాల్లోకి వెళితే జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం ఐలాపూర్ గ్రామానికి చెందిన అల్లుకోరు గోపికృష్ణ…ఈ గోపికృష్ణ సర్పంచ్ ఎన్నికల్లో ఉంగరం గుర్తుతో బరిలో నిలిచి లుంగీ కట్టుకుని జబ్బకు గొంగళి వేసి బండికి నిరుద్యోగి స్టిక్కర్ తగిలించుకుని ఓటర్లను ఆకర్షిస్తున్నాడు.. నిత్యం గ్రామంలో ఉంటూ అందరికి అందుబాటులో ఉండే ఉన్నత చదువులు చదువుకున్న విద్యావంతుడైన నిరుద్యోగి గోపికృష్ణ ఇంటింటా ప్రచారం చేస్తూ,యువతకు మార్గదర్శకంగా గ్రామ పెద్దలకు అనుయాయంగా…మహిళల ఓటర్లను వృద్ధులను అన్యోన్యంగా పలకరిస్తూ… నేను పెద్దచదువులు చదువుకున్న నిరుద్యోగిని అని గ్రామ ప్రజల ముందుకెళ్తున్నాడు….ఈ గోపికృష్ణను ను ఐలాపూర్ గ్రామ ప్రజలు సర్పంచ్ గా గెలిపించి ఆశీర్వదిస్తారని కోరుకుందాం

