రణం న్యూస్ కోరుట్ల, జూలై 15: అందరికీ కంటి వైద్య పరీక్షలు లయన్స్ క్లబ్ లక్ష్యంగా సేవాభావంతో పని చేయడం అభినందనీయం అని వక్తలు కొనియాడారు. మంగళవారం కోరుట్ల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పట్టణంలోని పద్మశాలి భవనంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించా రు. ఈ శిబిరంలో 224 మందికి కంటి పరీక్షలు చేసి ఇందులో 54 మందికి మోతె బిందు (Cataract) సమస్యతో బాధపడుతిన్నట్లు గుర్తించి ఉచిత శస్త్ర చికిత్స కోసం రేకుర్తి కంటి ఆసుపత్రికి ప్రత్యేక బస్ లో తరలించారు. ప్రతీ ఒక్కరికి రూ. 20,000 వేల విలువైన సర్జరీలు నిర్వహించేందుకు ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ ఆఫ్ కోరుట్ల అన్ని రకాల సౌకర్యాల ఏర్పాట్లు చేశారు. శస్త్ర చికిత్స అనంతరం ఈ నెల 17న తిరిగి కోరుట్లకు భద్రతగా చేర్చనున్నట్లు వెల్లడించారు.ఈ కార్యక్రమంలో కోరుట్ల లయన్స్ క్లబ్ అధ్యక్షులు కొమ్ముల జీవన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఏలేటి లక్ష్మారెడ్డి, కోశాధికారి నల్ల గంగాధర్ , లయన్ గుంటుక చంద్రప్రకాష్, గుంటుక సురేష్ బాబు, పీఆర్సీలు ఆడెపు మధు, అల్లాడి ప్రవీణ్, ఉషాకిరణ్, పోతని ప్రవీణ్, పీజడ్ సీ మంచాల జగన్, కుందారపు మహేంధర్, నరేందర్,గుణాకర్ రెడ్డి,పడాల నారాయణ గౌడ్,వనపర్తి చంధ్రం,గుంటుక మహేష్, గాజంగి నాగభూషణం, మండలోజు రవీంధర్, వేంకట్రాములు, కేజీ క్రిష్ణ, రాజేంద్రప్రసాద్, కల్లెం గంగా రెడ్డి, బెజ్జంకి శ్రీనివాస్ రావు, రాజశేఖర్, పుప్పాల ప్రభాకర్, భూంరెడ్డి, డాక్టర్ కట్కం జగదీశ్వర్ పాల్గొన్నారు.
ఇలాంటి సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు ఆరోగ్య చైతన్యం పెంపొందించడం, అవసరమైన వైద్య సేవలను అందించడం లక్ష్యంగా కోరుట్ల లయన్స్ క్లబ్ నిరంతరంగా కృషి చేస్తోందని లయన్స్ క్లబ్ అధ్యక్షులు కొమ్ముల జీవన్ రెడ్డి తెలిపారు.
